ఇటీవల.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కందుకూరులో నిర్వహించిన బహిరంగ సభ సమయంలో… తొక్కిసలాట జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా… ఈ ఘటన నేపథ్యంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతోపాటు పంచాయితీ రాజ్ రోడ్లు, మున్సిపల్ రోడ్లపై సభలు, సమావేశాలను నిషేధిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. ప్రజలకు ఇబ్బందులు కల్గించకూడదన్న ఉద్దేశంతోన...
ఆర్ఆర్ఆర్ మొదలు పెట్టినప్పటి నుంచి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్.. కొట్టుకుంటునే ఉన్నారు. ఈ సినిమా హాలీవుడ్‌లో దుమ్ములేపుతున్న కూడా గొడవ పడుతున్నారు. ఈసారి ఏకంగా అవతార్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ పట్టుకొని లొల్లి చేస్తున్నారు. అసలు ఈ సారి ఫ్యాన్స్ వార్ చూస్తే.. ఇదేం రచ్చ రా బాబు అనక తప్పదు. యావత్ ప్రపంచాన్ని ఆకర్షించిన ‘ఆర్ఆర్ఆర్’కు.. జేమ్స్ కేమరాన్ ఫిదా...
నారా లోకేష్.. పాదయాత్రకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. ఈ పాదయాత్ర కి ప్రభుత్వం పెడుతున్న కండిషన్స్ పై టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ మండిపడ్డారు. లోకేష్ పాదయాత్రకు డీజీపీ దేశంలో ఎక్కడా లేని కండిషన్లు పెట్టడం తాడేపల్లి కుట్రే అని బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రకి ఎంత మంది వస్తారో, ఎన్ని కార్లు వస్తాయో వాటి వివరాలు ఇమ్మంటే ఇవ్వడం సాధ్యమా అని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత...
పట్టాలు దాటుతూ.. రైలు ఢీకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. పట్టాలు దాటుతుండగా ఎదురుగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించ...
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుర్తింపు కార్డులను జారీ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈవో సదా భార్గవి మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులతో ఆలయ సిబ్బంది, ఉద్యోగులు గౌరవ మర్యాదలతో వ్యవహరించాలని తెలిపారు. టీటీడీలో వివిధ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మెరుగైన వేతనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కార్పొరేషన్ ఉద్యోగుల మేలు కోసం మార్గదర్శక...
విశాఖలో హత్యాయత్నం కలకలం రేపింది. తండ్రిపై కూతురు కత్తితో దాడి చేసింది. శంకరమఠం ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రేమ వ్యవహారంలో మందలించినందుకు తండ్రిపై కోపంతో కూతురు ఈ దాడి చేసింది. పోలీసులకు తండ్రి ముకుందరావు ఫిర్యాదు చేయడంతో బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు తన లవర్ కి ఇంట్లోని నగలు, నగదు రహస్యంగా ఇచ్చింది. అంతేకాదు అతడినికి ఇవ్వడానికి మరిన్ని డబ్బులు కూడా ఇవ్వమని తండ్రిని...
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేయడానికి సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించే రాత పరీక్షలను ఆన్...
కామం మైకంలో వావివరసలు చూడడం లేదు. పిల్లాజెల్లా అని చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అభంశుభం తెలియని చిన్నారులను కూడా దుర్మార్గులు చిదిమేస్తున్నారు. అలా ఒకరు మేనమామ వరుసైన వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడగా.. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర...
తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ కేడర్‌కు రిపోర్ట్ చేసిన మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు పోస్టింగ్ ఇచ్చే అంశంపై సమాలోచనలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేసిన సోమేష్ కుమార్‌కు ఏ శాఖను అప్పగించాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందట. వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో మరికొందరు సీని...
మరో రెండు నెలల్లో విశాఖ పరిపాలన రాజధాని కానుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ శనివారం తెలిపారు. బీచ్ ఐటీ పేరిట విశాఖలో ఐటీ అభివృద్ధి జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్టమని కాబట్టి ఇతర రాష్ట్రాలతో ఏపీ అభివృద్ధిని పోల్చడం సరికాదన్నారు. టెక్నికల్ గా విభజన నేపధ్యంలో ఏపీ పాత రాష్టమే అయినప్పటికీ..రాజధాని హైదరాబాద్ వంటి ఆర్థిక నగరం తెలంగాణలో ఉన్నందున ఏపీ మళ్లీ కొత్తగా ప్రారంభిం...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే ఏపీలోకి అడుగుపెట్టాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆంధ్ర ప్రజలపై చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు క్షమాపణలు చెప్పాలని తెలిపారు. క్షమాపణ చెప్పకుండా వస్తే ఏపీలో కేసీఆర్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు. విభజన సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయాలని కోరారు. ...
మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఓ సైకో, శాడిస్ట్ అని వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ విమర్శించారు. అయ్యన్నపాత్రుడి చరిత్ర అందిరికీ తెలుసన్నారు. నర్సీపట్నంను గంజాయి అడ్డాగా మార్చారని ఆరోపించారు. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఈరోజు (శనివారం) విశాఖలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం అయ్యన్నపాత్రుడికి పట్టుకుందన్నారు. అందుకోసమే పార్టీ నేతల ఇళ్లకు తిరుగుతున్నాడని ఎద్ద...
ఏపీ సర్కార్ భట్రాజు పొగడ్తలు అనే పదబంధాన్ని నిషేధించింది. అయితే తాజాగా ఆ పదప్రయోగాన్ని చేసి అనంత శ్రీరామ్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల సంక్రాంతి సంబరాల్లో భట్రాజు పదప్రయోగం చేయడంతో వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై అనంత శ్రీరామ్ బహిరంగ క్షమాపణ చెప్పారు. భట్రాజు కులసంఘాలు ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా అనంత శ్రీరామ్ పై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పాలకొల్లులో సంక్రాంతి సంబరాలు జరుగుతుండ...
ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. సాధారణంగా మార్చిలో బడ్జెట్ సమావేశాలను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నిర్వహించాలని, అది కూడా 20 రోజుల పాటు సెషన్స్ నిర్వహించాలని జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, ఆ తర్వాత 28, 29 తేదీల్లో జీ-20 వర్కింగ్ గ్రూప్ సదస్సు జరగబోతోంది. వీటిని దృష్టిలో ఉం...
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన పెళ్లి గురించో, ఇతర విషయం గురించి చేయలేదు. కాఫీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ఆమె ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకోగా, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, తనతో కాఫీ ఉందని పేర్కొంది. ఈ మేరకు ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేశారు. 14 ఏళ్ల నుంచి తనకే కాఫీ తాగే అలవాటు ఉందని వివరించారు. ఆ వీడియో వైరల్ అవుతుంది. […]