ఆర్కే రోజాను ప్రస్తావిస్తూ ‘ఇది వరకే తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక మంత్రి రోజా చెప్పారు’ అంటూ ప్రసంగిస్తుండగా అక్కడే ఉన్న అధికారులు, మీడియా ప్రతినిధులు ‘ఆంధ్రప్రదేశ్’ అని రెండు మూడుసార్లు చెప్పారు. ఈ పరిణామానికి వెంటనే తేరుకున్న కిషన్ రెడ్డి, రోజా ఇద్దరు గొల్లున నవ్వారు. ఆ సమావేశంలో పాల్గొన్న వారందరూ నవ్వుకున్నారు. అయితే ఈ విషయమై రోజాకు వివరణ ఇస్తుండగా.. ‘పర్లేదు. కానీయండి’ అంటూ రోజా అన్నారు. అనం...
ఆర్థికమంత్రి మాట్లాడుతూ... మూడు రాజధానులు ఏమీ లేవని, విశాఖనే తాము రాజధానిగా చేయబోతున్నామని స్పష్టం చేశారు. కర్నూలులో న్యాయ రాజధాని కాదని, అక్కడ కేవలం హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.
kotamreddy vs anil:నెల్లూరు (nellore) బారషహీద్ దర్గా వద్దకు భక్తులు వస్తుంటారు. ఈ రోజు కూడా రద్దీగా ఉంది. అక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. కత్తిపోట్లు పొడుచుకోగా.. పోలీసులను మొహరించారు. దర్గా వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు తీసుకు రావాల్సిన మంత్రి, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి వనిత (Vangalapudi Anitha) ధ్వజమెత్తారు.
RK Roja: నారా లోకేశ్‌పై (nara lokesh) మంత్రి ఆర్కే రోజా (RK Roja) ఫైరయ్యారు. నిన్న నగరి (nagari) యువగళం పాదయాత్రలో రోజాను.. జబర్ధస్త్ ఆంటీ అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దానికి ఈ రోజు రోజా కౌంటర్ ఇచ్చారు. లోకేశ్ ఐరన్ లెగ్ (iron leg) అన్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో రుజువు అయ్యిందని పేర్కొన్నారు. లోకేశ్‌కు (lokesh) పెద్దలను గౌరవించడం తెలియదని మండిపడ్డారు.
ఏపీలో కేంద్ర పర్యటక శాఖ మంత్రి (Kishan reddy) కిషన్ రెడ్డి పర్యటించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి (Amaravathi) అమరావతిలో బుద్దధ్యానవనం(Buddhyanavanam)ప్రారంభించారు. రూ.7 వేల కోట్లతో 'స్వదేశీ దర్శన్' పేరుతో దేశవ్యాప్తంగా టూరిజం అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు వెల్లడించారు.
ముఖ్యమంత్రి జగన్, హోంమంత్రి వనిత తమ పదవులకు రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలి పోతుందని తెలుగు మహిళా ఆధ్యక్షురాలు వంగలపూడి అనిత మంగళవారం మండిపడ్డారు. తాడేపల్లి పరిధిలో ఓ అంధురాలిపై గంజాయి బ్యాచ్ కత్తితో దాడి చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వివేకానంద రెడ్డి బతికి ఉన్నా.. చనిపోయినా తమ పార్టీ అధినేత వైయస్ జగన్ కడప లోకసభ స్థానాన్ని అవినాశ్ రెడ్డికే ఇచ్చేవారని స్పష్టం చేశారు. ఇందుకు కారణం కూడా ఉందని చెప్పారు. జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, కడప ఎంపీగా, వైయస్ విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో వివేకానంద, కుటుంబం ప్రత్యర్థి పార్టీ తరఫున నిలిచారని గుర్తు చేశారు. సొంత అన్న కొడుకును, వదినను ఓడించేందుకు ప్రయత్నించారన్నారు.
విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం... తెలుగు సాహితీ, కళాప్రియులకు సుపరిచితం. ఇప్పుడు ఆ కళాక్షేత్రం పేరు కూడా మారింది! ఈ పేరులోను తుమ్మలపల్లివారి క్షేత్రయ్య పేరు మాయమైంది. కేవలం కళాక్షేత్రం అని మాత్రమే ఉంది.
ప్రజల సెల్‌ఫోన్‌లకు కూడా స్టిక్కర్లు అంటించాలని సిద్ధమవుతోంది వైసీపీ ప్రభుత్వం. మార్చి 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు జగనన్నే మా భవిష్యత్తు పేరిట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకు 5.65 లక్షలమంది వైసీపీ సమన్వయకర్తలు, గృహసారథులు ఇందులో పాల్గొంటారు.
30 mlas work is not satisfy:30 మంది ఎమ్మెల్యేల (30 mlas) పనితీరు వెనకబడిందని ఏపీ సీఎం జగన్ (cm jagan) అన్నారు. ఈ రోజు ఆయన తాడేపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేల పనితీరు సర్వేను సమావేశంలో ఆయన ప్రదర్శించారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని నేతలకు స్పష్టం చేశారు.
nara lokesh: నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా నగరి (nagari) నియోజకవర్గంలో కొనసాగుతోంది. గత ఎన్నికల్లో నగరిలో గెలవలేకపోయామని.. జబర్దస్త్ ఆంటీ (jabardast anuty) గెలిచిందన్నారు. ఈసారి ఆ చరిత్రను తిరగరాయాలని పిలుపునిచ్చారు. నగరిలో గెలవాలంటే కలసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని టీడీపీ కార్యకర్తలకు స్పష్టం చేశారు.
BJP Leader Clarity on alliance with janasena : ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ విషయంలో పవన్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా... ఈ విషయంలో బీజేపీ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉంది. తాము.. జనసేనతోనే పొత్తు పెట్టుకుంటామని.. కలిసి పోటీ చేస్తామని బీజేపీ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది. కాగా... తాజాగా... మరోసారి బీజేపీ నేతలు ఈ విషయంపై స్పందించారు.