Anitha: పుంజు ఐతే అమర్నాథ్ తెలియదని చెబుతాడన్న టీడీపీ
ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు తీసుకు రావాల్సిన మంత్రి, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి వనిత (Vangalapudi Anitha) ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు తీసుకు రావాల్సిన మంత్రి, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి వనిత (Vangalapudi Anitha) ధ్వజమెత్తారు. ఏపీలో మహిళలపై దారుణాలు జరుగుతున్నాయని, పరిశ్రమలు వస్తే కాని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చి, ఈ ఘోరాలు ఆగిపోవని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలు తేవాల్సిన సదరు పరిశ్రమల శాఖ మంత్రికి (Gudivada Amarnath) ఏం మాట్లాడాలో తెలియక… కోడి గుడ్డు (Egg) పెట్టాలి.. గుడ్డు పెట్టె.. పుంజు కావాలంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మరో విషయం గుడ్డు పెట్టె అయితేనే పరిశ్రమలు వస్తాయి.. పుంజైతే మళ్లీ తనకు తెలియదంటారని చురకలు అంటించారు. గుడ్డు, కోడి గురించి తాము అడిగామా అని నిలదీశారు. చంద్రబాబు (Chandrababu Naidu() హయాంలో కృష్ణానదిలో వరల్డ్ వైడ్ బోట్ రేసింగ్ జరిగిందని గుర్తు చేశారు.
అమ్మా… మీరు హోమ్ మినిస్టరే..
హోమ్ మినిస్టర్ తానెటి వనితకు (Thaneti Vanitha) కూడా చురకలు అంటించారు వంగలపూడి. అమ్మా.. హోమ్ మినిస్టర్ గారు… మీరు రిజైన్ చేస్తే.. మీరు హోమ్ లోనే ఉండవచ్చు. హ్యాపీగా మీ ఇంటికి మీరే మినిస్టర్. ఎందుకంటే మీకు అనవసరం… మీకు ఆ గట్స్ లేవు.. కనీసం పక్క రాష్ట్రంలో దిశ యాక్ట్‌లో ఎవరినో షూటౌట్ చేస్తే అసెంబ్లీలో కూర్చొని సెల్యూట్ చేస్తారు.. చప్పట్లు కొడతారు… ఆ గన్.. జగన్ అంటూ ప్రగల్బాలు పలుకుతారు. అరె.. నీ రాష్ట్రంలో సీఎం ఇంటి పక్కన ఆడబిడ్డను కత్తితో నరికితే స్పందించడం లేదు… ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ పరిస్థితి ఇది. హోమ్ మినిస్టర్‌తో పాటు సీఎం జగన్ కూడా రాజీనామా చేస్తే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలి పోతుందన్నారు.
సింహమా.. గ్రామ సింహమా…
మాట్లాడితే పులివెందుల పులి, సింహం సింగిల్‌గా వస్తుందని చెబుతుంటారని.. మీ మొహాలు తగలెయ్య.. సింహం సింగిల్‌గా కాదు.. పోలీసులు, పరదాలు లేకుండా మీ సింహాన్ని రోడ్డు మీదకు రమ్మని చెప్పండంటూ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అసలు అది సింహమో.. గ్రామసింహమో అర్థం కావడం లేదన్నారు. మహిళలపై జరుగుతున్న దారుణాలకు స్పందించని ప్రభుత్వం.. చనిపోతే రూ.10 లక్షలు, అత్యాచారం జరిగితే రూ.5 లక్షలు ఇచ్చే జీవో వీరికి ఉన్నట్లుగా ఉందని దుమ్మెత్తి పోశారు. ఈ డబ్బులు భారతి పర్సు నుండో, వాసిరెడ్డి పద్మ పర్సు నుండో, జగన్ జేబు నుండో ఇవ్వడం లేదన్నారు. అక్కడితో సరిపెడుతున్నారని, నిందితులను మాత్రం అరెస్ట్ చేయడం లేదన్నారు. ఏపీలో దిశ యాప్ ఎంతమంది మహిళలకు ఉపయోగపడుతుందో తెలుసుకోవాలని సూచించారు.