nara lokesh:ఏపీ సీఎం జగన్‌పై (jagan) టీడీపీ యువనేత నారా లోకేశ్ (nara lokesh) ఫైరయ్యారు. చిత్తూరు జిల్లా సత్యవేడులో లోకేశ్ యువగళం (yuvagalam) పాదయాత్ర జరుగుతోంది. తాడేపల్లిలో (tadepalli) చూపులేని బాలిక (minor girl) హత్య గురించి ప్రస్తావించారు. బాలిక కుటుంబానికి అన్యాయం జరిగిందని తెలిపారు. చిన్నారి ప్రాణాలకు రూ.10 లక్షలు (10 lakhs) ఇచ్చి వెల కట్టారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. బాలిక ప్రాణం రూ.10 లక్షల అంటూ ధ్వజమెత్తారు. తను రూ.20 లక్షలు (20 lakhs) ఇస్తా.. బాలికను తిరిగి తీసుకొస్తారా అని నారా లోకేశ్ (lokesh) నిలదీశారు.
జగన్ అసమర్థతో పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని నారా లోకేశ్ విమర్శించారు. జగన్ కక్ష సాధింపుల వల్ల అమరరాజా (amar raja) కంపెనీ తెలంగాణ (Telangana) రాష్ట్రానికి తరలి వెళ్లిందని తెలిపారు. జగన్ నాలుగేళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. బయటకు రావాలంటే జగన్‌కు పరదాలు కావాలని ఎద్దేవా చేశారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో చూపు లేని బాలిక దారుణ హత్యకు గురయ్యింది. బాలికపై రౌడీ షీటర్ రాజు (raju) లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక ఇంట్లో చెప్పడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మెడపై కత్తితో నరకడంతో తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.
ఇన్సిడెంట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (chandrababu naidu) స్పందించారు. తాడేపల్లిలో సీఎం నివాసానికి కూతవేటు దూరంలో బాలిక హత్య (girl murder) షాక్‌నకు గురిచేసిందని తెలిపారు. చూపు లేని బాలికను హతమార్చడం దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్నారు. సీఎం నివాస ప్రాంతంలో రౌడీషీటర్లు, గంజాయి బ్లేడ్ బ్యాచ్ స్వైరవిహారం చేస్తుందని ఆరోపించారు. అక్కడే అలా ఉంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటీ అని అడిగారు.