30 mlas work is not satisfy:30 మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదు: సీఎం జగన్
30 mlas work is not satisfy:30 మంది ఎమ్మెల్యేల (30 mlas) పనితీరు వెనకబడిందని ఏపీ సీఎం జగన్ (cm jagan) అన్నారు. ఈ రోజు ఆయన తాడేపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేల పనితీరు సర్వేను సమావేశంలో ఆయన ప్రదర్శించారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని నేతలకు స్పష్టం చేశారు.
30 mlas work is not satisfy:30 మంది ఎమ్మెల్యేల (30 mlas) పనితీరు వెనకబడిందని ఏపీ సీఎం జగన్ (cm jagan) అన్నారు. ఈ రోజు ఆయన తాడేపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేల పనితీరు సర్వేను సమావేశంలో ఆయన ప్రదర్శించారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని నేతలకు స్పష్టం చేశారు. చాలా కాలంగా పనితీరు మెరుగుపర్చుకోని పలువురు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. గడప గడపకు కార్యక్రమంలో తక్కువ రోజులు తిరిగిన ఎమ్మెల్యేల వివరాలను సమావేశంలో ప్రస్తావించారు.
వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయించే అంశం పనితీరు ఆధారంగానే ఉంటుందని తేల్చిచెప్పారు. పనితీరు మెరుగుపర్చుకోకుంటే టికెట్లు కష్టమేనని సంకేతాలు ఇచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు. ‘మా భవిష్యత్ నువ్వే జగన్’ పేరుతో కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. మార్చి 18 నుంచి ప్రత్యేక కార్యాచరణకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. ఈ దిశగా పార్టీ కన్వీనర్లు, సచివాలయ సమన్వయ కర్తలకు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. త్వరితగతిన ఏరియా గృహ సారథులు, కన్వీనర్ల నియామకం పూర్తి చేయాలని, వారికి శిక్షణ ఇవ్వాలని నిర్దేశించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న జిల్లాల్లో కార్యక్రమం నిర్వహణపై సీఎం జగన్ (cm jagan) చర్చించారు. ఎన్నికల కోడ్ (election code) లేని జిల్లాల్లో కార్యక్రమం విస్తృతంగా చేపట్టాలని సూచించారు.
మరోవైపు ఆస్ట్రేలియా ఎంపీల బృందం (australia mps team) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చింది. ఆస్ట్రేలియా ఎంపీలు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను (cm jagan) కలిశారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఇంధన రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు. అనేక అంశాలపై సీఎం జగన్తో చర్చించారు. ఏపీలో పరిస్థితులను, ప్రభుత్వ విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్ట్రేలియా ఎంపీలు లీ టార్లామిస్, మాథ్యూ ఫ్రేగాన్ మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ను కలవడం సంతోషకరం అన్నారు. పరస్పర ఆలోచనలు, లక్ష్యాల గురించి చర్చించామని వెల్లడించారు. విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, ఆస్ట్రేలియాలో తాము ఆశిస్తున్న లక్ష్యాల్లో తేడా కనిపిస్తోందని అన్నారు. గతేడాది ఏపీ నేతలు ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే.