nara lokesh: నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా నగరి (nagari) నియోజకవర్గంలో కొనసాగుతోంది. గత ఎన్నికల్లో నగరిలో గెలవలేకపోయామని.. జబర్దస్త్ ఆంటీ (jabardast anuty) గెలిచిందన్నారు. ఈసారి ఆ చరిత్రను తిరగరాయాలని పిలుపునిచ్చారు. నగరిలో గెలవాలంటే కలసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని టీడీపీ కార్యకర్తలకు స్పష్టం చేశారు. “టీడీపీ గెలుపు కోసం ఊరూరా తిరగండి… కష్టపడాలని కోరారు. భాను (bhanu) ఉన్నాడు… కష్టపడి పనిచేస్తాడు. అతడిని దీవించండి. మంచి మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించండి” అని పేర్కొన్నారు.
జగన్‌కు లండన్ మందులు పనిచేయడం లేదు
తన పాదయాత్ర దెబ్బకి వైసీపీ అంతిమయాత్ర మొదలైందని లోకేశ్ అన్నారు. జగన్‌కు (jagan) లండన్ మందులు (london medicine) పనిచేయడం లేదన్నారు. లోకేశ్‌ను (lokesj) ఆపేందుకు 1000 మంది పోలీసులు (1000 police), 20 మంది ఎస్సైలు, 10 మంది సీఐలు, ఆరుగురు డీఎస్పీలను పెట్టారని గుర్తుచేశారు.ఎక్కడ నడిస్తే అక్కడ 30 పోలీసు వాహనాలు (30 vehicles) ముందు వెళతాయని.. తన పేరు లోకేశ్… తాను నక్సలైట్‌ను కాదన్నారు. ఎక్కడికి వెళ్లినా ఒక డ్రోన్ ఎగరేస్తారు. అమరావతిలో రఘురామిరెడ్డి (raghurami reddy) అనే ఒక ఐపీఎస్ కూర్చుని లోకేశ్ పాదయాత్రకు ఎంతమంది వచ్చారు, లోకేశ్ ఏం మాట్లాడాడు అని గడగడ వణికిపోతూ చూస్తుంటారు. నువ్వు నా సౌండ్ వెహికిల్ లాక్కున్నావ్… తగ్గేదే లేదు… నా మైక్ వెహికిల్ లాక్కున్నావ్… తగ్గేదే లేదు… నా స్టూలు కూడా లాక్కున్నావ్… అయినా తగ్గేదే లేదు.
మైక్ పీకాడు
3 సంవత్సరాల 8 నెలల్లో జగన్ నా మైక్ (mic) పీకాడని హాట్ కామెంట్స్ చేశారు. జగన్ రెడ్డీ… నువ్వు టెన్త్ ఫెయిల్. నీకే అంత తెలివి ఉంటే స్టాన్ ఫోర్డ్ లో చదివిన నాకు ఎంత తెలివి ఉంటుందో ఆలోచించుకోవాలని సూచించారు. నా మైక్ లాక్కున్నావ్… నా గొంతు కాదన్నారు. నందమూరి తారక రామారావు (ntr) ఇచ్చిన గొంతు ఇది అన్నారు. జగన్‌కు బంపర్ ఆఫర్ ఇస్తున్నానని.. 400 రోజులు పాదయాత్ర చేస్తానని.. తనపై 400 కేసులు పెట్టు అని.. ఎఫ్ఐఆర్ చూసి భయపడనని లోకేశ్ స్పష్టంచేశారు.
Day-18
నగరి నియోజకవర్గంలో లోకేష్ అన్న యువగళం పాదయాత్ర.🙏#YuvaGalamPadayatra#NaraLokeshForPeople#NaraLokesh#YuvaGalam pic.twitter.com/4DNWz7cA9b
— Vinod (@TDPNextGen) February 13, 2023
అప్పుడు ఆపామా..?
గతంలో చంద్రబాబు (chandrababu) సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి (ys rajashekar reddy), జగన్ (jagan), షర్మిల (sharmila) పాదయాత్ర చేశారు. ఏనాడైనా వారి మైక్ లాక్కున్నారా? లక్ష కోట్లు తిని జైలుకు వెళ్లిన జగన్‌కు నో రూల్స్. ఆయన పాదయాత్రలో 9 మంది చనిపోతే నో రూల్స్. ఆనాడు చంద్రబాబును అడుగడుగునా తిడితే నో రూల్స్. ఈ రోజు యువత తరఫున పాదయాత్ర చేస్తుంటే జీవో నెం.1 తీసుకువచ్చాడని గుర్తుచేశారు. జీవో నెంబర్ 1ని ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో.. లోకేశ్ మాత్రం ఆగడన్నారు.
నడక పరుగై.. అడుగులు పిడుగులై..
వైసీపీకి దడ పుట్టిస్తోన్న నారా లోకేష్.నారా లోకేష్ వేస్తున్న ఒక్కో అడుగు వైసీపీ సర్కారు గుండెల్లో పిడుగుల్లా పడుతున్నాయి.
సైకో జగన్ ఆపుతున్నకొద్దీ పాదయాత్రకు మరింత ఊపొచ్చింది.#YuvaGalamPadayatra #YuvaGalam #NaraLokesh #YuvaGalamLokesh pic.twitter.com/58CBn9CIHb
— Sai Bollineni ™ ⭕️ (@saibollineni) February 13, 2023
జిల్లాకు ఓ సైకో
జగన్ ఒక సైకో.. జిల్లాకు ఒక సైకోను తయారుచేశాడు. చిత్తూరు జిల్లాలో ఉన్న సైకో పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy). ఇక్కడ అవినీతి జరిగినా, ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగినా, ఇసుక మాఫియా జరిగినా దాని కేరాఫ్ అడ్రస్ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అతనికి పోటీగా నగరి ఎమ్మెల్యే, డైమండ్ పాప! (diamond papa) అని అన్నారు. లోకేశ్ నన్ను పాపా అంటాడా అని మొన్న బాగా ఫీలైందని తెలిసింది. అమ్మా క్షమించండి… మీ కోరిక మేరకు మిమ్మల్ని జబర్దస్త్ ఆంటీ (jabardast anuty) అని పిలుస్తానని తెలిపారు. మహిళా మంత్రి అయిన ఈ జబర్దస్త్ ఆంటీ డైరెక్షన్లో గ్రావెల్ యమా స్పీడుగా తవ్వేస్తున్నారు. రోజుకు 150 టిప్పర్లు తమిళనాడుకు (tamilnadu) వెళుతున్నాయి. వడమాలపేట మండలం కాయం రెవెన్యూ పరిధిలో పేదల పట్టా భూముల్లో జబర్దస్ద్ ఆంటీ తవ్వకాలు జరుపుతోందన్నారు.
యువగళం @naralokesh 🔥🔥😍💥💢💢
నగరి నియోజకవర్గంలో లోకేష్ సభకు పోటెత్తిన జనం… టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు…. pic.twitter.com/vz5NAiMvYP
— Team Lokesh (@Srinu_LokeshIst) February 13, 2023
కమీషన్
వడమాలపేట మండలం పాదిరేడులో టీటీడీ ఉద్యోగులకు 400 ఎకరాలు సేకరించి ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అక్కడ దళితుల భూములు ఉన్నాయని.. రూ.20 లక్షలు ఇస్తాను… అందులో 20 శాతం ఇవ్వండి అని ఈ జబర్దస్త్ ఆంటీ అడిగిందని లోకేశ్ (lokesh) ఫైరయ్యారు. ఎమ్మెల్యే అయిందో గ్రానైట్ కంపెనీలకు, క్వారీలకు ఫోన్ చేసేదట.. ఆమె దెబ్బ తట్టుకోలేక వారు పరారయ్యారని తెలిపారు. నగరి నియోజకవర్గాన్ని కేకు ముక్కల్లా కోసి కుటుంబ సభ్యులకు, బంధువులకు పంచిపెట్టిందన్నారు.
రోజా అండ్ ఫ్యామిలీ
అన్న రాంప్రసాద్ రెడ్డికి (ram prasad reddy) వడమాలపేట, నిండ్ర, పుత్తూరులను ఇచ్చేసింది. విజయపురం మండలాన్ని కుమారస్వామికి (kumara swamy), నగరి మండలాన్ని భర్త సెల్వమణి (selvamani) తమ్ముడికి పంచిపెట్టింది. ఆ లెక్కన నగరికి ఒక్క ఎమ్మెల్యే కాదు ఐదుగురు ఎమ్మెల్యేలు. వీరందరూ రాత్రి జబర్దస్త్ ఆంటీతో కూర్చుని తాము దోచుకున్న సొమ్ము లెక్కలేసుకుంటారు. కొసలనగరంలో 35 ఎకరాల (35 acres) ప్రభుత్వ భూమిని కబ్జా చేసింది. వడమాలపేట టోల్ గేటు వద్ద 55 ఎకరాల ప్రభుత్వ భూమి గోవిందా అన్నారు. వైజాగ్ రుషికొండ వద్ద కూడా ఒక ఎకరం ఆక్రమించిందట. ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్ వెళ్లడం బాగా ఇష్టం. అదే ధ్యాస మీరు ఇక్కడున్న చేనేతలపై ఎందుకు పెట్టడం లేదు? 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని జగన్ రెడ్డి చెప్పాడు. ఏమైంది ఆ 300 యూనిట్ల విద్యుత్ అని అడిగారు.
నగరి నియోజకవర్గంలో లోకేష్ గారి పాదయాత్ర కి పోటెత్తిన జన ప్రభంజనం… జై లోకేష్ జై జై లోకేష్ 💛💛#YuvagalamPadayatra#NaraLokesh pic.twitter.com/pIPo9PuHqE
— @RKR (@krishnadevaansh) February 13, 2023