చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన పెళ్లి గురించో, ఇతర విషయం గురించి చేయలేదు. కాఫీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ఆమె ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకోగా, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, తనతో కాఫీ ఉందని పేర్కొంది. ఈ మేరకు ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేశారు. 14 ఏళ్ల నుంచి తనకే కాఫీ తాగే అలవాటు ఉందని వివరించారు. ఆ వీడియో వైరల్ అవుతుంది. లైకులు, కామెంట్లతో నిండిపోతుంది.
‘అల్లరికి ప్రశాంతతను ఇచ్చేది నువ్వే. జీవితంలో వచ్చే చీకటికి వెలుగులు నువ్వే. ఉదయం లేస్తున్నానంటే కారణం నువ్వే. 14 ఏళ్ల వయసులో పరిచయం అయ్యావ్. అప్పటినుంచి నాతోనే ఉన్నావ్. థాంక్యూ మై డియర్ కాఫీ’ అని శ్రీజ రాశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్లో ఫ్యామితో శ్రీజ కనిపించారు. అక్క సుష్మితతో కలిసి మూవీని కూడా చూశారు.
భర్త కళ్యాణ్ దేవ్‌తో విడిపోయారని.. ప్రస్తుతం వీరు వేర్వేరుగా ఉంటున్నారని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాని శ్రీజ చేసిన పోస్ట్ హల్ చల్ చేస్తోంది. ఐయామ్ లివింగ్ ది రిలేషన్ షిప్ విత్ సెల్ఫ్ అంటూ శ్రీజ చేసిన పోస్ట్ మరిన్ని అనుమానాలను కలిగిస్తోంది.