SKLM: టీడీపీ ఏచ్చెర్ల మండల నాయకులతో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మండల టీడీపీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణకు నాయకులతో సంక్షిప్త విశ్లేషణ చేశారు. సూపర్-6 పథకాలు అమలు చేయడంతో ప్రభుత్వం గ్రాఫ్ పెరిగిందన్నారు. ఇదే ఉత్సాహంతో అందరూ కలిసికట్టుగా పని చేయాలని అన్నారు.
PPM: మహిళా మార్ట్ పనులు త్వరితగతిన పూర్తి చెయ్యాలని జిల్లా DRDA PD ఏం.సుధారాణి మంగళవారం ఆదేశించారు. ఈమేరకు గుమ్మలక్ష్మీపురం లేవుడిలో మహిళా మార్ట్ కోసం జరుగుతున్న పనులును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా దస్త్రాలు పక్కగా నిర్వహించాలని సూచించారు. అనంతరం దిగువమండల నిర్వహిస్తున్నా మిల్లెట్ షాపు పరిశీలించారు.
NLR: వినాయక చవితిని పురస్కరించుకుని నెల్లూరు ప్రజానీకానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వార్లు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగా విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలతో ప్రజలకు ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని వారు ఆకాంక్షించారు. అనంతరం వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు.
NLR: రాష్ట రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ నెల్లూరు మాగుంట లేఔట్‌లోని విపీఆర్ నివాసంలో మంగళవారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వార్లు అందించిన ఆత్మీయ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ మేరకు పార్టీ బలోపేతం, పలు రకాల సమస్యలపై అందరూ చర్చించుకున్నారు.
SS: అగళి మండలం దాసేగౌడనహళ్లిలో పట్టు రైతులకు మంగళవారం అవగాహన శిబిరం జరిగింది. అనంతపురం ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డా. రమ్య, మురళి, జాయింట్ డైరెక్టర్ శోభారాణి, సహాయ సంచాలకులు హనుమంతరాయలు పాల్గొని మల్బరీ ఆకుల దిగుబడి, నాణ్యత, తెగుళ్లు, వ్యాధుల నివారణపై సూచనలు ఇచ్చారు. అధిక దిగుబడికి అవసరమైన మెళకువలను రైతులకు వివరించారు.
GNTR: అర్హులైన దివ్యాంగులకు న్యాయం చేయాలని గుంటూరు జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధికార ప్రతినిధి నూర్ బాషా, అల్లా బాషా కోరారు. పొన్నూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఎం.రమేశ్ బాబును మంగళవారం దివ్యాంగ నాయకులతో కలిసి వినతి పత్రం అందించారు. ఇటీవల జరిగిన రీ-వెరిఫికేషన్‌లో డాక్టర్ల అవగాహన లోపంతో చాలామంది దివ్యాంగులకు పర్సంటేజీలు తగ్గాయన్నారు.
కృష్ణా: మత సామరస్యం వెల్లివిరియాలని డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ అన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం చల్లపల్లిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దల చేతుల మీదుగా 400ల మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ప్రజల్లో లౌకిక భావన, సమైక్యత పరివ్యాప్తి కావాలని కోరారు. సీఐ కే.ఈశ్వరరావు, ఎస్సై సుబ్రహ్మణ్యం, షేక్ నసీం ఘోరీ, సీఐటీయూ మండల కార్యదర్శి కరీముల్లా పాల్గొన్నారు.
VSP: టీడీపీలో అన్ని సంస్థాగత ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన విశాఖలో మాడియతో మాట్లాడారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వారికి, అన్ని వర్గాల వారికి అవకాశం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమిస్తామని చెప్పారు.
NLR: నగరంలోని కొండాయపాలెం గేట్, వనంతోపు సెంటర్ మినీ బైపాస్ వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కారు బైకు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయని స్థానికులు తెలియజేశారు. ఈ మేరకు కారు వేగంగా ఢీకొనడంతో బైక్ పై ఉన్న వ్యక్తి కాలికి త్రీవ గాయం అయింది. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
GNTR: గుంటూరు- చుట్టుగుంట వీఐపీ మెయిన్ రోడ్డు వద్ద డ్రైనేజీ నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టారు. మంగళవారం మున్సిపల్ అధికారులు డ్రైనేజీ నిర్మాణం చేపట్టడానికి మెయిన్ రోడ్డుపై రాకపోకలను బంద్ చేశారు. డ్రైనేజీలో ఎక్కువగా కూరుకుపోయిన బురద, చెత్తను బయటకు తీసి తొలగించే ఏర్పాట్లను ముమ్మరం చేశారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
KDP: మదర్ థెరిస్సా జీవితం అందరికీ ఆదర్శమని ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ రెడ్డి అన్నారు. పులివెందుల లోని ఇస్లాంపురం ఉన్నత పాఠశాలలో మంగళవారం మదర్ థెరిస్సా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అని జాతిని మేల్కొలిపిన వ్యక్తి మదర్ థెరిస్సా అని కొనియాడారు.
ELR: ఏలూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను అందజేశారు. జనసేన నాయకులు నారా శేషు ఆధ్వర్యంలో 10,000 వినాయక ప్రతిమలు, 10,000 వినాయక వ్రత కల్ప పుస్తకాల పంపిణీ చేశారు. గాలి, నీరు, మరింత కాలుష్యం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలను వినియోగించాలని కోరారు.
PPM: వ్యాధులను సకాలంలో నిర్ధారణ చేయాలని జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహన్ సూచించారు. కొమరాడ మండలంలో కోటిపాం, గంగరేగువలస గ్రామాలను మంగళవారం సాయంత్రం ఆయన సందర్శించారు. కోటిపాంలో నిర్వహించిన సంచార చికిత్సా వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. రోగులకు చేపట్టిన ఆరోగ్య తనిఖీలు, వైద్య పరీక్షల వివరాలు రికార్డులో పరిశీలించారు.
AKP: విశాఖ రేంజ్ డీఐజీ గోపినాధ్ జెట్టి అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్‌ను మంగళవారం సందర్శించారు. మహిళా పోలీస్ స్టేషన్ ద్వారా మహిళా భద్రతా చర్యలను మరింత బలపర్చాలని సూచించారు. మహిళా చట్టాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి ట్రాఫిక్ స్మార్ట్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు.
GNTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు ఫిరంగిపురంలోని ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహించబడింది. జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి కే.సంజీవరావు మాట్లాడుతూ.. 12 కంపెనీలు ఈ మేళాలో పాల్గొని 54 ఉద్యోగ అవకాశాలను కల్పించాయని తెలిపారు.