• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మిర్చి యార్డులో రైతులకు భోజన సదుపాయం

గుంటూరు మిర్చి యార్డులో అన్నదాతల కోసం గురువారం నుంచి భోజన పథకం ప్రారంభం కానుంది. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో, అధికారులు గుత్తేదారుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక వ్యక్తికి అల్పాహారం, భోజనం కలిపి రూ. 88.25 ధరగా నిర్ణయించారు (టిఫిన్ రూ. 20, భోజనం రూ. 68.25). యార్డు ఛైర్మన్ కుర్రా అప్పారావు, కార్యదర్శి చంద్రికలు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

February 26, 2026 / 08:15 AM IST

వెంకటేశ్వర స్వామి ఆలయ ఆదాయం ఎంతంటే..?

అనకాపల్లి పట్టణం భీముని గుమ్మం వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం అధికారులు హుండీలను తెరచి లెక్కించారు. కానుకల రూపంలో రూ.4,26,767 లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి చంద్ర తేజ తెలిపారు. 50 రోజులకు ఈ ఆదాయం లభించినట్లు పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

February 26, 2026 / 08:15 AM IST

ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

VSP: ఫిజియోథెరపీ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గాజువాక ఉడా కాలనీలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైడా రజిని (21) అనే విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్లో వెల్లడించింది. న్యూపోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 26, 2026 / 08:10 AM IST

వచ్చే నెల 7న జిల్లా స్థాయి యోగా పోటీలు

KRNL: ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 7వ తేదీన కర్నూలు డీఎస్ఏ స్టేడియంలో జిల్లాస్థాయి బాలికల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యోగా సంఘం వర్కింగ్ ప్రెసిడెంటు డా.ఎస్. ముంతాజ్బేగం ఇవాళ తెలిపారు. 7- 9 ఏళ్లు, 10- 13 ఏళ్లు, 14- 18 ఏళ్ల విభాగాల్లో పోటీలు జరుగుతాయని వెల్లడించారు. వివరాలకు 7981515467 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

February 26, 2026 / 08:10 AM IST

మంత్రి అచ్చన్నాయుడుతో బల్లా పల్లవి భేటీ

ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి విజయవాడలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. మార్కెట్ యార్డులో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను మంత్రికి వివరించి, వాటి పరిష్కారంపై చర్చించారు. యార్డును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రావాలని కోరగా, త్వరలోనే సందర్శిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

February 26, 2026 / 08:09 AM IST

మాజీ మంత్రి అంబటితో భేటీ అయిన షర్మిల రెడ్డి

E.G: మాజీ మంత్రి అంబటి రాంబాబును YCP నేత మేడపాటి షర్మిల రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలు, పార్టీ అంతర్గత విషయాలపై వీరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్, ఎస్సీ నాయకుడు కాటం సంజయ్ కాంత్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు.

February 26, 2026 / 08:07 AM IST

‘పరిశ్రమలకు వేగంగా అనుమతులు మంజూరు చేయండి’

SS: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను జాప్యం లేకుండా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 16 పరిశ్రమలకు పెట్టుబడి రాయితీలను మంజూరు చేశారు. ఎంఎస్ఎంఈ పనులను లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు.

February 26, 2026 / 08:06 AM IST

మూడేళ్లపాటు ఉచితంగా సివిల్స్ కోచింగ్

తిరుపతిలోని APSPDCL సీఎండీ కార్యాలయంలో “వెంకటపతి విద్యా దీవెన” పేరుతో పేద, వెనుకబడిన వర్గాల యువతకు రాష్ట్ర, కేంద్ర సివిల్ సర్వీసుల కోసం మూడేళ్లపాటు ఉచిత బోర్డింగ్, లాడ్జింగ్, కోచింగ్ ఇవ్వనున్నారు. మొత్తం 200 మందికి ఈ అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బాలురకు వినుకొండలో, బాలికలకు కేతనకొండ (విజయవాడ)లో ప్రవేశ పరీక్షలు ఉంటాయన్నారు.

February 26, 2026 / 08:06 AM IST

అమలాపురం ఇంచార్జి ఆర్డీవో‌గా జేసీ నిశాంతి

కోనసీమ: అమలాపురం ఇంచార్జి ఆర్డీవోగా జేసీ టి.నిశాంతి బాధ్యతలు అప్పగించారు. రామచంద్రపురం, కొత్తపేట, అమలాపురం ఆర్డీవో‌లు బదిలీ కావడంతో వారి స్థానాల్లో ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తపేట, రామచంద్రాపురం ఇంచార్జి ఆర్డీవో‌గా జిల్లా సర్వ శిక్షా ఏపీసీ జీ.మమ్మీ కి బాధ్యతలు అప్పగించారు.

February 26, 2026 / 08:05 AM IST

‘జిల్లాను రాష్ట్రంలోనే ముందుంచాలి’

BPT: సూర్యఘర్ యూనిట్ల స్థాపనలో బాపట్ల జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని కలెక్టర్ వినోద్‌కుమార్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో 24,620 యూనిట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. జిల్లాలోని 45 గోదాముల్లో ఇప్పటికే 20 పూర్తయ్యాయని, మిగిలిన వాటి పనులు వేగవంతం చేయాలని తెలిపారు.

February 26, 2026 / 08:05 AM IST

జనసేన సభ్యత్వాల ఇన్‌ఛార్జ్‌గా కొరికాన భవాని

SKLM: పాతపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ సభ్యత్వాల ఇన్‌ఛార్జ్‌గా కొరికాన భవానిని పార్టీ అధిష్ఠానం బుధవారం నియమించింది. శ్రీకాకుళంలో నిర్వహించిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సభ్యత్వాల నమోదు కోసం ఏడు నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను నియమించామని పార్లమెంట్ నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ రవికుమార్ తెలిపారు.

February 26, 2026 / 08:01 AM IST

నీతి ఆయోగ్ ప్రతినిధులను కలసిన కలెక్టర్

PPM: జిల్లా అభివృద్ధికి నీతి ఆయోగ్ పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి కోరారు. నీతి ఆయోగ్ అధికార ప్రతినిధి ఆయుషి అగర్వాల్ బుధవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌ను కలసి జిల్లా సమగ్ర అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికపై వివరించారు.ఈ పర్యటనలో జిల్లా అధికారులు, నీతి అయోగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

February 26, 2026 / 08:00 AM IST

సోలార్ పథకాల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

NDL: జిల్లాలో అమలులో ఉన్న సోలార్ విద్యుత్ పథకాల పురోగతిని వేగవంతం చేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్లో APSPDCL అధికారులు, సోలార్ వెండర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన 9 పనుల్లో 4 పనులకు స్థలాలు ఖరారు కాగా, మిగిలిన పనులకు భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.

February 26, 2026 / 08:00 AM IST

మార్చి 1న గురుకులాల్లో ప్రవేశాలకు పరీక్ష

KDP: అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్లో ప్రవేశాలకు మార్చి 1న పరీక్ష నిర్వహిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల సమన్వయకర్త ఉదయశ్రీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతికి ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు, ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

February 26, 2026 / 08:00 AM IST

‘మార్కెట్ యార్డులో ఈ-నామ్ 2.0 అమలు’

KRNL: ఈనెల 25 నుంచి మార్కెట్ యార్డులో ఈ-నామ్ 2.0 ప్రక్రియను అమలు చేస్తున్నట్లు కార్యదర్శి ఆర్.జయలక్ష్మి బుధవారం తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్‌లతో మార్కెట్ కార్యాలయంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని కార్యదర్శి సూచించారు.

February 26, 2026 / 08:00 AM IST