టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు.
టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలను అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతోందని చంద్రబాబు గవర్నర్‌కు లేఖ రాశారు. వ్యవస్థలను ప్రభుత్వం రాజకీయ కక్షల కోసం వాడుకుంటూ.. టీడీపీ నేతలను వేధిస్తోందని తెలిపారు.
సీనియర్ నేత హరిరామజోగయ్య పవన్ కల్యాణ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. జనసేన మంచికోసం చెప్తే తననే వైసీపీ కోవర్టు అంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికే లేఖలు రాసిన ఈయన తనకు సలహాలు ఇవ్వద్దని పవన్ కల్యాణ్ చెప్పిన తరువాత మళ్లీ లేఖ రాశారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయని సునీత విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు జగన్ పార్టీకి ఓటు వేయవద్దన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. పవన్ నాలుగో పెళ్ళాం ప్రస్థావనపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. నాదేండ్ల మనోహారే ఆయనకు ఫోర్త్ వైఫ్ అంటూ విమర్శించారు.
వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చాలామంది కీలకనేతలు పార్టీ నుంచి విడిపోయారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.