పవన్ కల్యాణ్ సినిమాలోకి బలవంతంగా వచ్చాడు. కానీ రాజకీయాల్లోకి ఇష్టంతోనే వచ్చాడు. ఏ తండ్రికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లిగా ఈ అన్నయ్య ఓ మాట చెప్పాను.
గత ఎన్నకల్లో వైసీపీకి ఓటు వేసినందుకు ఎస్సీల తరఫున టీవీ రామారావు చెప్పుతో కొట్టుకున్నాడు. వైసీపీ అధికారంలో ఎస్సీల హక్కుల, పథకాలు అన్ని నిర్లక్ష్యానికి గురయినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే జైలు, హత్యలు అని వైసీపీపై ఆరోపణలు చేశారు.
ఈసారి ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 2047లో వికసిత్ భారత్ మోదీ లక్ష్యమైతే.. వికసిత్ ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు.
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిందనే విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది.
కాకినాడ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న పోటీ .. ఆసక్తికరంగా మారింది. వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ పోటీచేస్తుండగా, జనసేన నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బరిలో దిగారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు పళ్లం రాజు కూడా తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని వైసీపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్‌షో నిర్వహించారు. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు సాయిధరమ్ తేజ్‌ను లక్ష్యంగా చేసుకుని రాళ్ల దాడికి దిగారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లకు ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది . ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఫేక్ ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది. FIRలో A1గా చంద్రబాబు నాయుడు, A2గా నారా లోకేష్ పేర్లను చేర్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలో వస్తే ఆగిపోయిన పోలవరం పూర్తి చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. రాయలసీమను నిర్లక్ష్యం చేశారని కేంద్రంలో మోడీ అధికారంలో వస్తే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్ని పూర్తి చేస్తామని తెలిపారు.
రాజకీయాలంటే ఐదు నిమిషాల నూడుల్స్ కాదని, అడ్డంకులు, అపజయాలను ఎదుర్కొని ప్రజల నమ్మకాన్ని నాయకులు సంపాదించుకోవాలని జనసేన వ్యవస్థాపకుడు, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు.