ఓ దంపతులు అధిక వడ్డీ పేరుతో పలువురి నుంచి దాదాపు రెండు కోట్ల రూపాయలు తీసుకుని రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇది తెలిసిన బాధితులు మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఏపీలో జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులు కూడా వానలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు.
కూతురుని కాపురానికి పంపకుండా విడాకుల కోసం కోర్టులో కేసు వేసిందన్న కోపంతో విజయవాడలో ఓ వ్యక్తి తన అత్తను దారుణంగా హతమార్చాడు. విజయవాడలో నగర శివారులోని చనమోలు వెంకటరావు ఫ్లైఓవర్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై జరిగింది. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఏపీలో కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తూ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీలో భూముల రీసర్వే, రిజిస్ట్రేషన్ సేవల ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
టీడీపీ బహిరంగ సభ వేదిక ఒక్కసారిగా కూలిపోగా దానిపై కూర్చున్న 10 మందికిపైగా నేతలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఏపీ ఏలూరు జిల్లాలోని నూజివీడు పరిధిలో చోటుచేసుకుంది.
పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత పోసాని కృష్ణ మురళీ ఫైర్ అయ్యాడు. మీడియా ముఖంగా ఆయన పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాపుల మధ్య చిచ్చుపెట్టి పవన్ గెలవలేడని, ముద్రగడకు ఆయన క్షమాపణలు చెప్పాలని అన్నారు.
తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం పలు సూచనలు చేసింది. మెట్ల మార్గంలో నడిచి వెళ్లే భక్తులు గుంపులు, గుంపులుగా వెళ్లాలని తెలిపింది. అలాగే మెట్లమార్గంలో జంతువులు తిరిగే చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.