ఏపీలోని గుంటూరు విట్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీనియర్లు, జూనియర్ల మధ్య వాగ్వాదం తలెత్తగా..అది కాస్తా కొట్టుకునే స్థాయికి చేరింది. దీంతో ఇరు వర్గాల విద్యార్థులు తీవ్రంగా తన్నుకున్నారు. అయితే గదుల కేటాయింపు గురించి వారి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణ వీడియో కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అథ్లెటిక్స్ లో తెలుగమ్మాయిలు సత్తా చాటారు. జులై 12 నుంచి16 తేదీ వరకు బ్యాంకాక్‌లో జరిగే ఆసియా అథ్లెటిక్స్ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. మొత్తం పోటీల్లో పాల్గొనే 54మంది సభ్యుల బృందాన్ని గురువారం ప్రకటించారు.
తిరుమలలో ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది. బాలుడిపై దాడి చేసి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న పోలీసులు గట్టిగా కేకలు వేశారు. పోలీసుల కేకలకు భయపడిన చిరుత ఆ బాలుడిని అక్కడే వదిలేసి పారిపోయింది. తిరుమలలో నడకదారి మార్గం 7వ మైలు వద్ద గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
కోనసీమ జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సాగుతోంది. యాత్రలో భాగంగా నేడు అమలాపురంలో బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఏ1, ఏ2 నిందితులుగా రామోజీరావు, శైలజా కిరణ్ లను గుర్తిస్తూ సీఐడీ నోటీసులిచ్చింది. జులై 5వ తేదిన వారు గుంటూరులో విచారణకు రావాలని కోరింది.
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ఇప్పటికే నడుస్తున్న ట్రైన్లతోపాటు పలు 36 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అవెంటి ఎక్కడెక్కడ ప్రయాణిస్తాయో ఇప్పుడు చుద్దాం.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పర్యటనలో భాగంగా టాలీవుడ్ హీరోల గురించి ప్రస్తావించారు. వారాహిలో గోదావరి జిల్లాలను కవర్ చేస్తూ రైతులనుద్దేశించి ప్రసంగిస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్(BRS) నేతలపై వస్తున్న లైంగిక వేధింపులు క్రమంగా పెరుగుతున్నాయి. మొన్న జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా ఓ యువతిని లైంగికంగా వేధించాడని వెలుగులోకి వచ్చింది. తాజాగా బోధన్లో ఏకంగా బీఆర్ఎస్ నేత ఓ 13 ఏళ్ల బాలికపై అత్యచారం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి ఎత్తు(height)తో ఉండాలని, వెడల్పుగా కనిపించాలని కోరుకుంటారు. అయితే వారి ప్రవర్తన, వారి జ్ఞానం ద్వారా పిల్లలను ఎక్కువగా గుర్తిస్తారు. అయితే వారి వయస్సును బట్టి తక్కువగా పెరుగుతున్నారని లేదా వారి పెరుగుదల ఆగిపోయిందని మీరు భావిస్తే ఈ వ్యాయామాలు క్రమంగా చేయడం ద్వారా పిల్లల్లో పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
వైసీపీ ప్రభుత్వం ఆగడాలను అందరం కలిసికట్టుగా అణచివేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ సర్కార్ కులాల మధ్య చిచ్చు పెడుతోందని, వాటిని తాను సహించబోనని ఆగ్రహం వ్యక్తం చేశారు.