»Is The Height Of The Child Not Increasing Do These 5 Exercises Daily
Height Increasing tips: పిల్లలు ఎత్తు పెరగడం లేదా? రోజూ ఈ వ్యాయామాలు చేయించండి
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి ఎత్తు(height)తో ఉండాలని, వెడల్పుగా కనిపించాలని కోరుకుంటారు. అయితే వారి ప్రవర్తన, వారి జ్ఞానం ద్వారా పిల్లలను ఎక్కువగా గుర్తిస్తారు. అయితే వారి వయస్సును బట్టి తక్కువగా పెరుగుతున్నారని లేదా వారి పెరుగుదల ఆగిపోయిందని మీరు భావిస్తే ఈ వ్యాయామాలు క్రమంగా చేయడం ద్వారా పిల్లల్లో పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
మీ పిల్లలు పెరగడం(height) లేదని భావిస్తున్నారా? అయితే ప్రతి రోజు వ్యాయామాలు(exercises) చేయించండి. వారి పెరుగుదలలో మార్పు కనిపిస్తుంది. ఈ వ్యాయామాలు మీ పిల్లల ఎదుగుదలకు దోహదం చేస్తాయి. అసలు అవి ఏంటో ఇప్పుడు చుద్దాం.
1. స్విమ్మింగ్
ఈత పిల్లల ఎత్తును పెంచడంలో చాలా సహాయపడుతుంది. నిజానికి స్విమ్మింగ్ చేయడం ద్వారా శరీరంలోని ప్రతి భాగంలో కదలిక ఏర్పడుతుంది. దీంతోపాటు కణజాలం ఉత్తేజితమై శరీరం బలాన్ని పొందే ఒక చర్య జరుగుతుంది. దీంతో సహజమైన విధానం కంటే మెరుగైన రీతిలో పిల్లలు ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది.
2. హ్యాగింగ్ వ్యాయామం
ఎక్కువసేపు ఎక్కడో ఓ చోట లేదా పార్కులలో వేలాడే వ్యాయామాలు చేపించాలి. ఎదైనా కర్ర లేదా ఇనుప కడ్డీని పట్టుకుని కాసేపు వేలాడటం ద్వారా ఎత్తు పెరగడానికి ఈ వ్యాయామం సరిగ్గా పనిచేస్తుంది. ఇది ప్రతి రోజు చేయడం ద్వారా చేతులు, శరీరంలో బాగాలపై కదలిక ఏర్పడుతుంది.
ప్రతిరోజు టోస్ టచ్ చేసి కాలి వేళ్లను తాకడం కూడా పిల్లలకు మంచి వ్యాయామం. ఇది నడుము, తొడ, కాళ్ళ కండరాలను బలపరుస్తుంది. ఇది వారి అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. చిన్న వయస్సులోనే పిల్లలకు ఈ వ్యాయామం చేయిస్తే అది వారి ఎత్తు పెరగడంలో కూడా సహకరిస్తుంది
4. స్నేక్ పోస్
స్నేక్ పోస్ పిల్లలను నేలపై లేదా చాపపై కడుపుపై పడుకోబెట్టి, రెండు చేతుల సహాయంతో ముందు శరీరాన్ని పైకి ఎత్తమని చెప్పండి. ఈ భంగిమలో కొంత సమయం పాటు ఉంచి, ఆపై విశ్రాంతి తీసుకోండి. ఇలా చేయడం ద్వారా, శరీర కండరాలు సాగదీస్తాయి. అది పెరుగుతున్న శరీరం పెరుగుదలను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.
5. రోప్ జపింగ్(స్కిప్పింగ్)
రోప్ జంపింగ్ లేదా స్కిప్పింగ్ చేయడం ద్వారా పిల్లల శరీరంలోని ప్రతి శరీర భాగాల్లో కదలిక ఏర్పడుతుంది. దీంతో శరీరం పెరుగుదల వేగంగా ఉంటుంది. ఇది ఎత్తును పెంచడంలో కూడా చాలా సహాయపడుతుంది.