ఏపీలోని గుంటూరు విట్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీనియర్లు, జూనియర్ల మధ్య వాగ్వాదం తలెత్తగా..అది కాస్తా కొట్టుకునే స్థాయికి చేరింది. దీంతో ఇరు వర్గాల విద్యార్థులు తీవ్రంగా తన్నుకున్నారు. అయితే గదుల కేటాయింపు గురించి వారి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణ వీడియో కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.