Jana Senani Pawan Kalyan was invited by the United Nations Committee
Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను అరుదైన ఆహ్వానం అందింది. ఈ నెల 22న జరిగే సదస్సుకు ఐక్యరాజ్య సమితి ఆహ్వానించింది. ఈ సమావేశంలో పవన్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న ప్రచారానికి రెండు రోజుల పాటు తాత్కాలిక బ్రేక్ ఇవ్వనున్నారు. ఈ నెల 20 న న్యూయార్క్ వెళ్లనున్నారు. అయితే భారతదేశం తరఫున ఈ సమావేశాలకు కేవలం నలుగురికి మాత్రమే ఆహ్వానం ఉంటుంది అందులో పవన్ కల్యాణ్‌కు చోటు దక్కడం విశేషం. నిస్వార్థంగా ప్రజలకు సేవా చేసేవారికే ఈ అవకాశం ఉంటుందని, పవన్ కల్యాణ్ నీతీ, నిజాయితో కూడిన రాజకీయాలు చేస్తున్నారని ఐరాస విశ్వసించి ఆయన్ను సభకు ఆహ్వనించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దేశంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళా ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. అందులో భాగంగా కూటిమిగా ఏర్పడిన బీజేపీ, జనసేన, టీడీపీ విస్తృత ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. స్టార్ క్యాంపెయినర్‌గా పవన్ కల్యాణ్ ప్రచారంలో బిజీగా ఉన్నారు. కూటమి అభ్యర్థుల తరఫున ఆయన ఎన్నిక ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎలాగైనా కూటమిని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఐరాస సభలో భాగంగా పవన్ మూడు రోజుల పాటు సభలకు దూరంగా ఉండబోతున్నారు. మే 13 ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.