»The Ycp Ranks Are Claiming The Kakinada Mp Seat Chalamalasetty Sunil Tangella Uday Srinivas
AP Elections: కాకినాడ ఎంపీ సీటు తనదే అంటున్న వైసీపీ శ్రేణులు
కాకినాడ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న పోటీ .. ఆసక్తికరంగా మారింది. వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ పోటీచేస్తుండగా, జనసేన నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బరిలో దిగారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు పళ్లం రాజు కూడా తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని వైసీపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
The YCP ranks are claiming the Kakinada MP seat Chalamalasetty Sunil, Tangella Uday Srinivas
AP Elections: కాకినాడ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న పోటీ .. ఆసక్తికరంగా మారింది. వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ పోటీచేస్తుండగా, జనసేన నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బరిలో దిగారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు పళ్లం రాజు కూడా తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని వైసీపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మే 13వ తేదీనలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా అదే తేదీన జరగనున్నాయి. ఏపీలో ఉన్న 25 స్థానాలకు ఒకే రోజున ఎన్నికలు పూర్తికానున్నాయి. మొత్తం 25 సీట్లలో కాకినాడ సీటు ప్రత్యేకతను సంతరించుకుంది. మే 13న జరగనున్న ఎన్నికల్లో కాకినాడ ఓటర్లు ఎవరిని కరుణిస్తారో అనే విషయంలో కొంత అస్పష్టత నెలకొని ఉంది. రాజకీయాలకు పూర్తిగా కొత్త అయిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. పవన్ కళ్యాణ్ అండదండలు పుష్కలంగా ఉన్న ఉదయ్‌కు టీడీపీ, బీజేపీ నేతలు ఎటువంటి సహకారం అందిస్తారనే విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల రోజున అసలు విషయం స్ఫష్టం కానుంది.
కాంగ్రెస్ తరపున సీనియర్ నేత పళ్లం రాజు ఈ సారి ఎన్నికల బరిలో నిలిచారు. తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీకి ఏపీలో నూకలు చెల్లాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే.. ఓటర్లు చీదరించుకుంటున్నారు. విభజన గాయాలు ఇంకా ఏపీ వాసులను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పళ్లం రాజు ఎన్నికల బరిలో నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పళ్లం రాజుకు పడే ఓట్లు ఎవరి విజయావకాశాలను దెబ్బతీస్తాయనే విషయం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున కాకినాడ లోక్‌సభ అభ్యర్ధిగా బరిలో దిగిన చలమలశెట్టి సునీల్ గత 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. డక్కీమొక్కీలు తిన్నారు. సొంతంగా బలమైన కేడర్‌ను నిర్మించుకున్నారు. వ్యక్తిగతం మంచి వ్యక్తి అని పేరు సంపాదించుకున్నారు. దానికి తోడు సీఎం జగన్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఈసారి తన విజయంపై ధీమాగా ఉన్నారు. తన ప్రత్యర్ధులుగా ఉన్న వారిద్దరి కంటే తనకే గెలుపు అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని భావిస్తున్నారు.
చలమలశెట్టి సుమన్ … విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వైసీపీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు విరిస్తున్నారు. జగన్ పాలనలో ఏపీ ఏ విధంగా అభివృద్ధి జరిగిందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతున్నారు. జగన్ పాలనలో కాకినాడకు ఎటువంటి మేలు జరిగిందనే విషయాలను కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాకినాడను క్లాస్టిక్ సోడా ఉత్పత్తుల హబ్‌గా మార్చామని చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్ ఏర్పాటు చేసిన విషయాన్ని బలంగా ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా రూ.2,700 కోట్లతో బిర్లా గ్రూపు గ్రాసిమ్ .. భారీ పెట్టుబడులు పెట్టిన విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. ఏప్రిల్ 21, 2022న సీఎం వైయస్ జగన్ కాస్టిక్ సోడా యూనిట్‌ను ప్రారంభించిన విషయాన్ని కూడా చలమలశెట్టి సునీల్ ప్రచారం చేస్తున్నారు. కాస్టిక్ సోడా యూనిట్ ద్వారా .. ఏటా 1.50 లక్షల టన్నుల కాస్టిక్ సోడా ఉత్పత్తి జరుగుతున్నట్లు కూడా సునీల్ ప్రజలకు గుర్తుచేస్తున్నారు. 1,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించిందని, త్వరలో మరో 1,100 మందికి ఉపాధి అవకాశం కలగనుందని సునీల్ చెబుతున్నారు. నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ గెలుపు అవకాశాలను పెంచుకునే పనిలో ఉన్నారు. సునీల్ గెలుపుకు వైసీపీ శ్రేణులు కూడా విరామం లేకుండా కృషి చేస్తున్నాయి. తన లోక్‌సభ పరిధిలోకి వచ్చే అన్ని నియోజకవర్గాల నాయకులను కలుపుకుపోతూ ముందుకు సాగుతున్నారు సునీల్.