EG: కడియం మండలం కడియపులంక శివారు దోసాలమ్మ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన జరిగిన అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో ఇల్లు దగ్ధం కాగా భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న కడియపులంక ఉప సర్పంచ్ పాఠంశెట్టి రాంజీ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని రూ.10 వేలు నగదును ఆర్థిక సాయం అందించారు.