MBNR: ప్రజల ప్రాణాల రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి అన్నారు. చైనా మాంజా వల్ల జరిగే ప్రమాదాలను నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా మానేయాలని, ఎవరైనా అమ్ముతున్నట్లు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.