WNP: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29 న జిల్లా కేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి సుధారాణి తెలిపారు. ఈ వేడుకలకు దివ్యాంగులు, స్వచ్ఛంద సంస్థలు, దివ్యాంగుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు.