PDPL: ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టాయి. గాంధీజీ పేరు తొలగించడం పేదల హక్కులను కాలరాయడమేనని, వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకులు మెరుగు అశోక్ గౌడ్, సాధవేణి చంద్రమౌళి, తదితర నేతలు డిమాండ్ చేశారు.