EG: గోకవరం మండలానికి చెందిన బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు శనివారం లక్నోలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యను మర్యాదపూర్వకంగా కలిశారు. కంబాల రామసేన అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ సీఎంకు శ్రీకృష్ణుని కంచు విగ్రహాన్ని బహూకరించారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను ఆదివారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.