SRCL: వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట ప్రభుత్వ పశు వైద్యశాలలో కాంట్రాక్టు పద్ధతిలో అటెండర్‌గా పని చేస్తున్న పెద్దాపురం శ్రీనివాస్ (43) గుండె పోటుతో మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున అస్వస్థతకు గురైన ఆయనను కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.