YS Sharmila: ఏపీసీసీ వైఎస్ షర్మిలపై పోలీసు కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలను ధిక్కరించారని వైఎస్సార్ జిల్లాలో షర్మిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 2న బద్వేల్లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో షర్మిల పాల్గొన్నారు. ఈ వేదికపై మాట్లాడుతూ వైఎస్ వివేకా హత్య కేసు గురించి ప్రస్తావించారు. ఆయన హత్య వెనుక జగన్ ఉన్నట్లు వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికల సమయంలో ఈ కేసు గురించి ప్రస్తావించొద్దని కోర్టు రాజకీయనాయకులను హెచ్చిరించింది.
ఈ సభలో షర్మిల మాటలపై బద్వేల్ నోడల్ అధికారి, బద్వేల్ మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ వివేకా హత్యకేసు తన రాజకీయలకు వాడుకుంటున్నారని, ఓటర్లను ప్రలోభపెట్టాడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటి పిటిషన్ ఆధారంగా షర్మిలపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి చుట్టూనే షర్మిల రాజకీయాలు చేస్తోందని కడప కోర్టులో కూడా ఓ పిటిషన్ దాఖలు అయింది. వైసీపీ నేత ఈ పిటిషన్ వేసినట్లు తెలుస్తుంది.