»Chiranjeevi In Support Of Pawan Kalyan Special Video What Is It
Chiranjeevi: పవన్ కల్యాణ్‌కు మద్దతుగా చిరంజీవి.. స్పెషల్ వీడియో.. ఏమన్నాడంటే?
పవన్ కల్యాణ్ సినిమాలోకి బలవంతంగా వచ్చాడు. కానీ రాజకీయాల్లోకి ఇష్టంతోనే వచ్చాడు. ఏ తండ్రికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లిగా ఈ అన్నయ్య ఓ మాట చెప్పాను.
Chiranjeevi in support of Pawan Kalyan.. Special video.. What is it?
Chiranjeevi: జనసేన అధ్యక్షడు పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్, దుర్గ సాయి తేజ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ఒక స్పెషల్ మీడియో విడుదల చేశారు.
చిరంజీవి మాట్లాడుతూ… “కొణిదెల పవన్ కల్యాణ్ అమ్మకడపున ఆకరివాడిగా పుట్టినా అందరికి మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందుగా వాడిగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్థత్వం. నా తమ్ముడు కల్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఎదైనా చేయాలి అనుకుంటారు. కానీ కల్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తూడిచేందుకు ఖర్చుపెట్టడం, సరిహాద్దు దగ్గర ప్రాణాలు ఒడ్డి పోరాడే జవాన్లకు పెద్ద మొత్తంలో అందివ్వడం, అలాగే మత్స్య కారులు ఇంకా ఎందరికో తాను చేసిన సాహయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాలి అనిపిస్తుంది.
ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తాను బలవంతంగా వచ్చాడు. కానీ రాజకీయాల్లోకి ఇష్టంతోనే వచ్చాడు. ఏ తండ్రికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లిగా ఈ అన్నయ్య ఓ మాట చెప్పాను. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం వాళ్ల బిడ్డల భవిష్యత్తుకోసం చేసే యుద్ధం అమ్మ ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా ఉండే మంచివాళ్ల వలనే ప్రజాస్వామ్యానికి నష్టం అని నమ్మి, జనం కోసం జనసైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్దాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి పవన్ కల్యాణ్. ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభల్లో అతడి గొంతు మనం వినాలి. జనమే జయం అని నమ్మే జనసేనాని ఏమేమి చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు కల్యాణ్‌ను గెలిపించాలి. మీ కోసం సేవకుడిగా, సైనికుడిగా, అండగా నిలబడుతాడు, ఏమైనా సరే కలబడుతాడు.. మీ కల నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం.. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి పవన్ కల్యాణ్‌ను గెలిపించండి. జై హింద్.”