Pawan Kalyan: Every defeat made the Jana Sena stronger
Pawan Kalyan: ఓటమి ఎప్పుడు పాఠాలు నేర్పుతుందని, ప్రతి ఓటమి దెబ్బ జనసేనను మరింత బలపడేలా చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఐదు కోట్ల మందికి జనసేన ధైర్యం నూరిపోసిందని తెలిపారు. రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం అవసరమని, దీని కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆత్మగౌరవం దెబ్బతింటేనే ఎదురుతిరగాలనిపిస్తుంది. నేను బతికి ఉండగా రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను. దేశ ఐక్యతకు భంగం కలనివ్వను. గులకరాయి పడితేనే జగన్ ఇంత పెద్ద డ్రామా ఆడారని పవన్ కల్యాణ్ అన్నారు. అక్కను వేధించవద్దు అన్నందుకు అమర్నాథ్గౌడ్ అనే బాలుడిపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. బాధ్యత లేని వ్యక్తులు పదువల్లో ఉంటే ఇలాంటి ఘోరాలే జరుగుతాయి.
బలవంతులపై చట్టాలు బలహీనంగా పనిచేస్తాయి. బలహీనులపై చాలా బలంగా పనిచేస్తాయన్నారు. అమర్నాథ్ విషయంలోనూ ఇదే జరిగిందని పవన్ అన్నారు. గొంతు ఎత్తకపోతే ప్రజాస్వామ్యంలో న్యాయం జరగదన్నారు. మట్టి మాఫియాలు, దోపిడీలు తప్ప అభివృద్ధి లేదు. భయపడితే సమాజంలో అభివృద్ధి జరగదు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతా. ఉపాధి అవకాశాలు రావాలంటే పరిశ్రమలు రావాలి. ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తాం. నిజాంపట్నం పోర్టును అభివృద్ధి చేసి, యువతకు ఉపాధి కల్పిస్తాం. మహిళలకు చేయూతనందించి వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడతామని పవన్ భరోసా ఇచ్చారు.