ప్రియాంక సోదరుడు రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ చేసిన విమర్శలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. యువరాజు అని మోదీ విమర్శలు చేయగా.. వాటికి ఆమె బదులిస్తూ మోదీపై మండిపడ్డారు.
Priyanka Gandhi: ప్రియాంక సోదరుడు రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ చేసిన విమర్శలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. యువరాజు అని మోదీ విమర్శలు చేయగా.. వాటికి ఆమె బదులిచ్చారు. తమ యువరాజు దేశ ప్రజల కోసం 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారంటూ జోడో యాత్ర గురించి తెలిపారు. మోదీని చక్రవర్తిగా తెలపుతూ ప్రియాంక విమర్శలు చేశారు. అధికారం కోసం గుజరాత్ ప్రజలను ఉపయోగించుకున్న ప్రధాని ఇప్పుడు వాళ్లనే మర్చిపోయారని మోదీపై ఆమె మండిపడ్డారు.
నా సోదరుడుని ఉద్దేశిస్తూ యువరాజు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అతనికి నేను ఒక విషయం చెప్పాలి. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4 వేల కిలో మీటర్ల పాదయాత్ర చేశాడు. రైతులు, కూలీలను కలిసి వాళ్ల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశాడు. మరీ ఈ చక్రవర్తి మోదీజీ కోటలోనే నివసిస్తున్నారు. దుస్తులు, జుట్టు చెక్కు చెదరకుండా రాజులా కనిపిస్తారు. అలాంటి వ్యక్తికి మీ కష్టం, సమస్యలు ఏం అర్థమవుతాయని ప్రియాంక అన్నారు.