PPM: ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO బ్రహ్మాజీరావు ఓ ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలన్నారు. జిల్లాలో గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో నిరవదికంగా 2024- 25, 2025-26 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలన్నారు.
SKL: దమ్మల వీధి, గోల్కొండ రేవు వీధుల్లో అతిసారం వ్యాపించి 25 కేసులు నమోదయ్యాయి. బాధితులను చికిత్స కోసం కొందరిని రాజీవ్ గాంధీ వైద్యశాలలో చేర్చి చికిత్స ఇవ్వగా కోలుకున్నారు. పరిస్థితిపై అధికారులు అప్రమత్తమై కలెక్టరేట్‌లో 08942-229080 హెల్ప్‌లైన్‌ను 24 గంటలు అందుబాటులో ఉంచారు. ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటా సర్వే చేపట్టారు.
కర్నూలు: కలెక్టర్ సిరి ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. నిర్ణీత గడువులోపు ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని, ఒక్క అర్జీ కూడా ఎస్‌ఎల్‌పీకి మించకూడదని స్పష్టం చేశారు.
KDP: కందిమల్లయపల్లిలోని జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠంలో నూతన మఠాధిపతుల పట్టాభిషేక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సజీవ సమాధి దర్శనం నిర్వహించగా, పూర్వపు మఠాధిపతి చిత్రపటానికి నూతన మఠాధిపతులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై మహోత్సవంలో పాల్గొన్నారు.
SKLM: నాగావళి నది తీరాన కొలువై ఉన్న శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా వచ్చిన ఆదాయాన్ని ఈవో సుకన్య ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ లెక్కింపులో ఆలయానికి రూ.2,38,567 ఆదాయం లభించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.
NDL: కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయినిపేటకి చెందిన నాగజయంతిని అదనపు కట్నం కోసం భర్త, కుటుంబ సభ్యులు వేధిస్తున్నట్లు సీఐ రమేశ్ బాబు తెలిపారు. నాగ జయంతిని నొస్సం గ్రామానికి చెందిన గాదంశెట్టి వెంకటరాముడుకి ఇచ్చి వివాహం చేయగా, కొంతకాలంగా అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో పుట్టింటికి చేరుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇవాళ కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో కదిరి యువకుడు చరణ్‌కుమార్‌కు బెంగళూరులోని వైదేహీ ఆసుపత్రిలో గుండె మార్పిడి సర్జరీ సక్సెస్ అయింది. బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి నుంచి గుండెను సేకరించి డా.దుర్గాప్రసాద్‌రెడ్డి వైద్య బృందం చరణ్‌కు అమర్చారు. ప్రస్తుతం యువకుడు ఆరోగ్యంగా ఉన్నారని మంత్రి ప్రతినిధి హారీశ్ బాబు తెలిపారు.
NTR: జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలో పల్లె పండగ 2.0 కార్యక్రమం కింద నిర్మించిన గోశాలను (కమ్యూనిటీ గోకులం) ను కలెక్టర్ లక్ష్మీశ సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.రూ.10 లక్షలతో నిర్మించిన గోశాల గ్రామంలోని పాలు ఉత్పత్తి చేసే రైతులకు మేలుకలుగుతుందని, పశుసంవర్థక రంగం అభివృద్ధికి తోడ్పడుతుందని కలెక్టర్ తెలిపారు.
NLR: ఉదయగిరి పోలీసులు ఓ బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఉదయగిరికి చెందిన ఓ బాలుడు, బాలికకు గతేడాది పరిచయమైంది. ఈ నేపథ్యంలో బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలుడు శారీరకంగా లొంగదీసుకుని గర్భిణిని చేశాడు. పెళ్లి చేసుకోవాలని కోరడంతో నిరాకరించాడు. దీంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుడిపై కేసు నమోదు చేశారు.
కోనసీమ: రామచంద్రపురంలో ఈ నెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయం సోమవారం వెల్లడించింది. 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ అర్హత ఉండి, 18-35 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఈ మేళాకు హాజరు కావచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యం అన్నారు.
VZM: మంత్రి నారా లోకేష్‌తో నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగమాధవి సోమవారం భేటీ అయ్యారు. ఆత్మీయ కుటుంబ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో భేటీ అయినట్లు ఆమె తెలిపారు. పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి లోకేష్ ఇచ్చిన డిన్నర్‌లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో కుటుంబ సమ్మేళనం జరిగిందని ఆమె తెలిపారు.
E.G: రాజమండ్రిలో నమోదైన ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఘటన నేపథ్యంలో కోరుకొండ మండలం నరసాపురం గ్రామాన్ని ఆరోగ్య శాఖ కమిషనర్ జి.వీర పాండ్యన్, తదితరులు సోమవారం పర్యటించారు. తాగునీరు, పాలు, ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని వారు స్పష్టం చేశారు.
KRNL: నిరుద్యోగ యువతకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) మంచి అవకాశం కల్పిస్తోందని జిల్లా అధికారి రాజ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27న (శుక్రవారం) ఉదయం 10 గంటలకు కర్నూలు అబ్బాస్ నగర్‌లోని రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాలలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని ఆయన సూచించారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో నేటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులు 8:30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మండలంలో జరిగే 2 పరీక్ష కేంద్రాల్లో 460 మంది విద్యార్థులు పాల్గొననున్నారు.