ATP: నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత లక్ష్యంగా జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి జాతీయ రహదారులు, ముఖ్య కూడళ్లలో వాహనాలను ఆపి పత్రాలను పరిశీలించారు. అక్రమ రవాణా, అనుమానాస్పద కదలికలను అరికట్టడమే ఈ ప్రత్యేక డ్రైవ్ ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.
కోనసీమ జిల్లా రావులపాలెం రైతు బజార్‌కు ఇకపై ప్రతి మంగళవారం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం..వారాంతపు సెలవుగా నిర్ణయించినట్లు ఎస్టేట్ ఆఫీసర్ తేజ సోమవారం తెలిపారు. కావున రైతులు, వ్యాపారుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కావున మంగళవారం రైతు బజార్ మూసి ఉంటుందని,వినియోగదారులు ఈ మార్పును గమనించాలన్నారు.
అన్నమయ్య: మదనపల్లెలో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇవాల మార్కెట్‌కు 66 వేల కిలోల (66 మెట్రిక్ టన్నుల) టమాటాలను రైతులు తీసుకువచ్చారు. మొదటి రకం 10 కిలోల టమాటాలు రూ.140, రెండవ రకం రూ.110, మూడవ రకం రూ.100లతో అమ్ముడుపోయినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. అన్ సీజన్ కారణంగానే టమాటాలకు రేట్లు పెరగడంలేదని, దిగుబడి పెరిగినా.. గిట్టుబాటు ధరలు పలకడం లేదని రైతులు వాపోతున్నారు.
PLD: పెదకూరపాడులోని లింగంగుంట్ల గ్రామంలో మంగళవారం ఉదయం పోలిసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ హనుమంతరావు పాల్గొని గ్రామంలో క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని 22 వాహనాలను గుర్తించారు. కొడవళ్ళు గుడ్డలు మారణా యుద్ధాలను కొన్నిటిని గుర్తించారు. సీఐ సురేష్, శ్రీనివాసరావు, ఎస్సై గిరిబాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
KDP: పొద్దుటూరు రామేశ్వరంలోని ముక్తిరామలింగే శ్వరస్వామి ఆలయంలో సోమవారం ఆలయ ఈవో శ్రీధర్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు. డిసెంబరు 29 నుంచి ఫిబ్రవరి 23 వరకు 55 రోజులకు భక్తులు స్వామివారికి రూ.80,035 కానుకల రూపంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ ఇన్‌స్పెక్టర్ కిరణకుమార్ రెడ్డి, పాలకమండలి సభ్యుడు, ఆర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
అనకాపల్లి: అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో 734 గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రూ.2,000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లాలో నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న సడక్ రోడ్లను మంజూరు చేయాలన్నారు.
SKLM: రాజాంలో గత రెండు రోజులుగా జరుగుతున్న పోలిపల్లి పైడితల్లి అమ్మవారు ఉత్సవాలకు ఇటు రాజకీయ నాయకులు, వ్యాపార సంస్థలు రోడ్డుకు అడ్డంగా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయడంతో రాకపోకలు సాగించే ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు. ఏ క్షణంలో వాహనాలు ఢీ కొట్టుకుంటాయోనని ప్రయాణికులు వాపోతున్నారు.
విశాఖ: నగరంలోని బిర్లా జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. భారీ వేగంతో డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణమయ్యే అంశాలను పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
ATP: అనంతపురం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదన్న కోపంతో నాగభూషణం అనే వ్యక్తి తన భార్య గౌరమ్మపై కొడవలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చిత్తూరు: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం.. అక్రమ కేసులు అధికమని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పుత్తూరులోని ఆయన నివాసంలో ఇవాళ మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కూటమి తప్పులను ప్రశ్నిస్తే అరాచకం, దౌర్జన్యం, దాడులు పెచ్చుమీరుతున్నాయన్నారు. మహిళలపై దాడులు, దౌర్జన్యాలు ఎక్కువవుతున్నాయని వాపోయారు.
PPM: ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దేవత, రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి జాతర 5వ వారం మంగళవారం జరగనుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో B.శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలియజేశారు. పటిష్ఠమైన క్యూలైన్లు, బారీకేడ్లు, శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనంతో పాటు ఉచిత దర్శనం, తాగు నీరు ఏర్పాటు చేశారని చెప్పారు.
ప్రకాశం: ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీలో పోలీసులు సోమవారం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 80 మందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి రికార్డులు లేని 4 ఆటోలు, 41 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాహన రికార్డులు చూపిన తర్వాత వాటిని యజమానులకు అప్పగించారు. అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా కాలనీలో ర్యాలీ చేపట్టారు.
బాపట్ల అప్పికట్ల రోడ్డులోని యారకాలువలో ఈతకు వెళ్లి గల్లంతైన ఇద్దరు యువకుల్లో వంశీకృష్ణ మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది. సోమవారం సాయంత్రం మద్యం మత్తులో ఈత పోటీకి దిగి వంశీ, చందు అనే స్నేహితులు నీటిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అధికారుల గాలింపు చర్యల తర్వాత వంశీ మృతదేహం బయటపడటంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
NLR: నగరంలోని బాబు ఐస్క్రీం ఎదురుగా మంగళవారం ఓ వ్యక్తి మద్యం తాగి వాహనాలకు అడ్డుపడ్డాడు. ఆటోలు, కార్లు, బైకులను ఆపి వాటిని పోనివ్వకుండా హల్‌చల్ చేశాడు. కొందరు యువకులు ఆ వ్యక్తిని పక్కకు తీసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
NLR: మహిళ అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించి, ఆమెపై పెట్రోల్ పోసి ఓ యువకుడు నిప్పంటించాడు. ఈ ఘటనలో మహిళతో పాటు యువకుడు కూడా గాయపడ్డాడు. ఇద్దరూ ప్రస్తుతం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.