జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ రికార్డులు బద్దలు కొట్టింది. బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వస్తున్న ఈ టాక్ షో పలు గత రికార్డులను పవర్ స్టార్ షో దాటేసింది. ఈ ఎపిసోడ్ ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్‌ను ఆహాలో క్రాస్ చేసిందట. ప్రభాస్ ఎపిసోడ్ రికార్డును బ్రేక్ చేసి, ఫాస్టెస్ట్‌గా నిలిచింది. వెండితెర మీద మాత్రమే కాకుండా ఓటీటీలోను పవన్ కళ్యాణ్ రికార్డుల...
నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి పైన మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రవి టీడీపీలో చేరేందుకు ప్లాట్‌ఫామ్ సిద్ధం చేసుకుంటున్నారని సంచలన ఆరోపణ చేశారు. తమ పార్టీ నేతలతో ఆయన టచ్‌లో ఉన్నారని, కానీ తాము ఈ నెల 4న ఆయన అక్రమాలు అన్నింటిని ఆధారాలతో సహా బయటపెడతామని హెచ్చరించారు. మాపై ఏవైనా ఆరోపణలు చేసేముందు, అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆధారాలు తీసుకు రావ...
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భుజాలపై తుపాకి పెట్టి జగన్‌ను టార్గెట్ చేస్తున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. పార్టీ మారాలనుకోవడం కోటంరెడ్డి వ్యక్తిగతమన్నారు. కానీ వైసీపీపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. కారణాలు వెతికి మరీ టీడీపీకి మేలు చేసేలా ఆయన వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ ఎ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విచారణ అనంతరం సీబీఐ దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, జగన్ కు అత్యంత సన్నిహితుడు నవీన్ కు సీబీఐ నోటీసులు అందించిన విషయం తెలిసిందే. తాజాగా వారిద్దరూ శుక్రవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. చదవండి: అలా చేస్తే 2030 కల్లా […]
తన గొంతు ఆగాలంటే తనను ఎన్‌కౌంటర్ చేయడం ఒక్కటే పరిష్కారమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అరెస్టుకు రంగం సిద్ధమంటూ లీకులు ఇవ్వడం ఏమిటని నిలదీశారు. ఎవరైనా అధికార పార్టీలోకి వెళ్లాలని చూస్తారని, కానీ తాను మాత్రం అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. చివరి వరకు పార్టీలో ఉండి నామినేషన్లకు ముందు రోజు మోసం చ...
కళాతపస్వి కే విశ్వనాథ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన మృతి ఎంతో బాధాకరం అన్నారు. సృజనాత్మక బహుముఖ దర్శకుడిగా తనని తాను ప్రత్యేకం చేసుకున్న సినీ ప్రపంచంలోని ప్రముఖుడు అని కొనియాడారు. ఆయన సినిమాలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి… ఆకర్షించాయన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే విశ్వనాథ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బీజేపీ అల్టిమేటం ఇచ్చిందా?… జాతీయ బీజేపీ నాయకత్వం జనసేనానికి అనుకూలంగానే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మూడు వర్గాలు ఉండటంతో… ఇక్కడి వైసీపీ వర్గంగా భావిస్తున్న నేతలు మాత్రం ఆయనకు అల్టిమేటం ఇచ్చినట్లుగానే చెప్పవచ్చు. వచ్చే ఎన్నికల్లో తమతో వస్తే జనసేనతో కలిసి పోటీ చేస్తామని లేదంటే ఒంటరిగానే ముందుకు వెళ్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చే...
తనకు తన తండ్రి హెచ్‌డీ దేవేగౌడ తర్వాత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయంగా ఎంతో స్ఫూర్తి అని కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి అన్నారు. రాయచూరులో నిర్వహించిన పంచరత్న రథయాత్రలో ఆయన మాట్లాడారు. నీటి పారుదల ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలులో దేవేగౌడ, తర్వాత కేసీఆర్ అద్భుతమన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ఎన్నో జిల్లాలకు నిరంతరం నీరు అందిస్తున్న కేసీఆర్ త...
కళాతపస్వి కే విశ్వనాథ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు పితృ సమానులని, అలాంటి వ్యక్తి ఇక లేరని తెలిసి నమ్మలేకపోతున్నట్లు చెప్పారు. ఆయన గొప్పతనం గురించి మాటలు చాలవని, పండితులను, పామరులను కూడా ఒకేలా మురిపించే ఆయన సినిమాల శైలి ఎంతో విశిష్టమైనదన్నారు. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్‌ను కూడా బ్లాక్ బస్టర్ హిట్స్‌గా మలిచిన దర్శకులు మరొకరు లేరన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిన...
ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు చుక్కలు చూపిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానికంగా పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ (ముత్తంశెట్టి శ్రీనివాస రావు)కు ఊహించని సంఘటన ఎదురైంది. ఎమ్మెల్యే తమ గ్రామానికి రావొద్దని కోరుతూ రోడ్డ...
ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించిన కళాతపస్వి కే విశ్వనాథ్ 92 ఏళ్ల వయస్సులో గురువారం రాత్రి మృత్యు ఒడిలోకి చేరారు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను అపోల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఐదు దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేశారు కాశీనాథుని విశ్వనాథ్. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ శోక సముద్రంలో మునిగింది. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, సిర...
తెలుగు సినీ దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా…అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. కె విశ్వనాథ్ భౌతికకాయాన్ని ఆయన స్వగృహానికి తరలిస్తున్నారు. కళాతపస్వీ ఇకలేరని తెలుసుకున్నతెలుగు చిత్రపరిశ్రమ షాక్‌కు గురైంది. కాశీనాధుని విశ్వనాథ్ తెలుగులో ఎన్నో గొప్ప మరుపురాని అజరామరమైన చిత్...
ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. అసలు ఫోన్ టాపింగ్ జరగనేలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిజమే అయితే తన సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి స్పీకర్ వద్దకు వెళ్దామని, ట్యాపింగ్ జరిగినట్లు నిరూపిస్తే నా రాజీనామాను యాక్సెప్ట్ చేయించుకుంటానని, జరగలేదని...
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి, హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలకృష్ణ ఫోన్ చేశారు. రాజకీయంగా ఈ రెండు పార్టీల నేతలకు పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. అలాంటిది వారు ఒకరికి మరొకరు ఫోన్ చేసుకోవడం ఏంటా అనే సందేహం కలుగుతోందా..? వీరు ఇరువురు తారకరత్నకు బంధువులు కావడం ఇక్కడ కామన్ పాయింట్. ఇంతకీ మ్యాటరేంటంటే… లోకేష్ పాదయాత్రలో పాల్గొని తారకరత్న అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరు...
ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సన్నాహక సదస్సు మంగళవారం ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగింది. అంతర్జాతీయ దౌత్యవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులు ఎందరో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. విశాఖపట్నం త్వరలో ఏపీ రాజధాని కాబోతుందని, రాబోయే కొద...