ATP: పామిడి మండలం కండ్లపల్లి గ్రామంలో శనివారం నిర్వహించే రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దారు షర్మిల తెలిపారు. గ్రామంలోని నర్వే నంబర్ 38లోని సబ్-డివిజజన్ భూములకు రీ సర్వే ఉంటుందన్నారు. ఆ సర్వేనెంబర్‌లో భూములు గల రైతులు భూ సర్వేకు సహకరించాలని ఆమె కోరారు.
CTR: జీడీనెల్లూరు తహశీల్దార్ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు రాజకీయ పార్టీల సమీక్ష సమావేశం జరగనుంది. ఈ మేరకు తహశీల్దార్ శ్రీనివాసులు ఓ ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలోని జాతీయ, రాష్ట్ర పార్టీల నాయకులు, ఎన్నికల అధికారులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు. బుధవారం జరగాల్సిన సమావేశం కొన్ని అనివార్య కారణాలతో నేటికి వాయిదా పడింది.
KRNL: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జనన.. మరణా లను 21 రోజుల్లో నమోదు చేసుకోవాలని DMHO డాక్టర్ భాస్కర్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. జనన, మరణాలను 21 రోజు ల్లోపు చేసుకొంటే సేవలు ఉచితంగా, 21 నుంచి 30 రోజుల్లో చేసుకొంటే రూ.25, నెల దాటితే రూ.250, ఏడాది అయితే రూ.500 రుసుముతో పాటు అఫిడవిట్ అధికారి అనుమతి అవసరమని ఆయన చెప్పారు.
ATP: రాయదుర్గం నియోజకవర్గం గోవిందవాడ, తారకాపురం మిర్చి రైతులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. ఇటీవల మిర్చి పొలాలలో జరుగుతున్న దొంగతనాలపై రైతన్నలకు తగు సూచనలు అందజేశారు. రాత్రి వేళల్లో ఎక్కువ సమయాల్లో రైతన్నలు తిరుగుతూ దొంగతనాలను నివారించుకోవాలని సూచించారు. తమ పోలీసు సిబ్బందిని సైతం నైట్ బీట్ నిర్వహించేలా చూస్తామని వారికి తెలిపారు.
ATP: తాడిపత్రిలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. గత 11 రోజుల నుంచి జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా రామలింగేశ్వరుడు, రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఏకాంతోత్సవం జరిపారు. ముగింపు వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.
NLR: విడవలూరు మండలం పార్లపల్లికి చెందిన ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసి అత్యాచారానికి యత్నించాడు. అదే సమయంలో ఆమె మామ ఇంటికి రావడంతో గోడ దూకి పారిపోయాడు. మహిళ ఫిర్యాదు మేరకు విడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
W.G: తణుకులోని ప్రధాన రహదారి అయిన రాష్ట్రపతి రోడ్డును సీసీ రోడ్డుగా నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రకటించారు. మహిళా కళాశాల నుంచి తేతలి వై జంక్షన్ వరకు ఈ రోడ్డు నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. గత నెల తణుకు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో మండల, పట్టణ కమిటీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
KDP: మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు కడప రెండో స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధించారని చిన్న చౌక్ SI రాజరాజేశ్వరి రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరపరిచామని ఎస్ఐ తెలిపారు.
సత్యసాయి: తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో టీడీపీ, చంద్రబాబు పాత్ర బహిర్గతమైందని మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ విమర్శించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ సంస్థకు అనుబంధమని ఇన్నాళ్లు ప్రచారం చేసి, ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. ఈ కల్తీ అంశం నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజను శుక్రవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ మేరకు నియోజక వర్గంలోని ఉపాధి హామీ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి అని ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు. సారవకోట ఎంపీడీవో కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
TPT: తిరుపతి నగరంలో ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 23 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు. అలాగే నగరంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా వాహనాలు నడిపిన 46 మందికి రూ.500 చొప్పున జరిమానా విధించారు. మొత్తంగా 69 మందిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు.
NTR: విజయవాడలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూఖ్ షూబ్లీ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనారిటీలంటే వైసీపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.గత జగన్ ప్రభుత్వంలో వేధింపులకు తట్టుకోలేక అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు.కోవాబన్ అంశంలో వలికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు.
NDL: శ్రీశైలం MLA బుడ్డా రాజశేఖర రెడ్డి శుక్రవారం సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న లింగాలగట్టు గ్రామానికి చెందిన టీడీపీ బూత్ కన్వీనర్ పోలయ్యను ఆయన పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు.
కృష్ణా: నాలుగేళ్ల క్రితం నాగాయలంక మండలంలోని భావదేవరపల్లిలో 559 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నివేశనా స్థలాలను కేటాయించింది. నాగాయలంక, భావదేవరపల్లి గ్రామాలకు చెందిన వారికి సెంటున్నర భూమి ఇచ్చి రాళ్లు వేశారు. ఈ కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తే ఒక ఊరుగా మారుతుందని ప్రజలు ఆశించారు. కానీ నేటికీ నిర్మాణాలు జరగకపోవడంతో పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి.