పరిపాలన రాజధానిగా కొన్ని నెలల్లో విశాఖపట్టణాన్ని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే పలు కార్యాలయాలు తరలించేందుకు సిద్ధమైంది. విశాఖ నుంచే పరిపాలన సాగించాలనే పట్టుదలతో సీఎం జగన్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సమ్మిట్ కూడా అక్కడే నిర్వహించనున్నారు. ఇక ఏపీ రాజధాని విశాఖనే అని చాటి చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తున్నది. అందుకే అన్ని కార్యక్రమాలకు విశాఖతో...
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నాలుగో రోజు కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో జరగనుంది. ఉదయం 8 గంటలకు యాత్ర ప్రారంభమై.. రాత్రి 7.20 గంటలకు ముగియనుంది. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను లోకేశ్ కలిసి, సమస్యలను తెలుసుకుంటున్నారు. యాత్రకు మహిళలు బ్రహ్మారథం పడుతున్నారు. స్వాగతం పలికి, వీర తిలకం దిద్దుతున్నారు. తమ సమస్యలు లోకేశ్‌తో చెప్పుకుంటున్నారు. చెల్దిగానిపల్లి క్యాంపు స్థలం నుంచి నాలుగో రోజు (సోమవారం) ...
అంతా భావిస్తున్నట్టుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. సోమ, మంగళవారాల్లో జగన్ దిల్లీలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 6.45 గంటలకు దిల్లీ చేరుకుంటారు. వన్ జన్‌పథ్ నివాసంలో రాత్రికి బస చేస్తారు. ఈనెల 31న ఉదయం 10.30 గంటలకు దిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్ సమ్మిట్ రౌండ్ టేబుల్ స...
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. యువగళం పాదయాత్రలో జగన్ సర్కార్ చర్యలను ఎండగట్టారు. జగన్‌ను నమ్మి అధికారం అప్పగిస్తే.. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. మద్యపాన నిషేధం హామీతో అధికారం చేపట్టి, మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆగ్రహాం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి చేపట్టిన తర్వాత అధిక ధరలపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కుప్...
సీబీఐ విచారణకు వెళ్లే ముందు వైఎస్ విజయమ్మను అవినాశ్ రెడ్డి కలవడం వెనుక ఆంతర్యమేమిటని టీడీపీ శాసనమండలి సభ్యుడు బీటెక్ రవి ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చిన తర్వాత 5 రోజుల గడువు దేనికి అని నిలదీశారు. చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేసినప్పుడు ఆత్మగౌరవం గుర్తుకురాలేదా ముత్యం అని అనివాశ్ రెడ్డిని ఎద్దేవా చేశారు. హత్య కేసు విషయంలో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెబుతున్న అవినాశ్ అసలు వివేకానందరెడ్డి హత్య జరి...
నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో స్పష్టత లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. ఏ విషయంలో క్లారిటీ లేకుండా పాదయాత్ర చేస్తున్న వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో గడపగడపకు కార్యక్రమంలో మంత్రి రజని పాల్గొన్నారు. పాదయాత్ర ఎందుకో.. ఆ యాత్ర లక్ష్యం ఏమిటో ఆయనకే తెలియనట్టు...
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని ఆరోపించారు. 3 నెలల నుంచి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని పేర్కొన్నారు. రహస్యాలు మాట్లాడుకునేందుకు తనకు మరో ఫోన్ ఉందన్నారు. 12 సిమ్ కార్డులు కూడా తన వద్ద ఉన్నాయని తెలిపారు. ఫేస్ టైమర్, టెలిగ్రాం కాల్స్‌ను పెగాసస్ రికార్డు చేయలేదని స్పష్టంచేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్...
నాలుగేళ్ల కిందట వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు పలికిన తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ పాలనలో ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పరోక్షంగా విమర్శలు చేశారు. తిరుమలలో అధికారుల తీరుపైన ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రముఖుల సేవలో టీటీడీ తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు...
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థతిపై నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అంతా నిలకడగానే ఉందని, పరిస్థితిపై ఆందోళన అవసరం లేదన్నారు. ఇంప్రూవ్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. డాక్టర్లు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తారకరత్న అందరితో కలివిడిగా ఉండే...
ఆంధ్ర ప్రదేశ్ లో తాము ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదని మంత్రి అంబటి రాంబాబు శనివారం స్పష్టం చేశారు. ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. ముందస్తు ఎన్నికల పేరుతో ప్రతిపక్షాలు వారి పార్టీలో సీట్ల కోసం నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగు దేశం, జనసేన పొత్తుపై కూడా అంబటి స్పందించారు. ఎంతమంది కలిసి వచ్చిన 2024 ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు అన్నారు. మళ్లీ జగన్ ముఖ్య...
టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకు గుండెపోటు వచ్చింది. ఇవాళ తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. హార్ట్ స్ట్రోక్ రావడంతో విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు. బచ్చుల అర్జునుడికి బీపీ అధికంగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మరో 24 గంటలు గడిచాక మరోసారి పర...
హిందువులు జరుపుకునే పండగల్లో అతి ముఖ్యమైన పండగ మహా శివరాత్రి. ఆ రోజు లింగోద్భవం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా శివ, పార్వతులకు వివాహం జరిగిన రోజు కూడా అదే. ఆ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజుగా భావించి భక్తులు అత్యంత భక్తితో పూజలు నిర్వహిస్తారు. ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 18వ తేదిన రానుంది. ఈ నేపథ్యంలో శైవ క్షేత్రాలు శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్నాయి. ఏపీలోని ప్రముఖ శైవ క్...
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పైన సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. కాల్ డేటా మొదలు ఆర్థిక లావాదేవీల వరకు వివిధ అంశాలపై సుదీర్ఘంగా నాలుగున్నర గంటల పాటు విచారించింది. విచారణ అనంతరం మరోసారి రావాలని సూచించింది సిబిఐ. తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా కొంతమంది బురద జల్లుతున్నారని, అందుకే విచారణను వీడియో తీయమని కోరగా అంగీకరించలేదని చెప్పారు అవినాష్. న్యాయవాదిని కూడా ...
శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు ప్రారింభించి 22 రోజులపాటు నిర్వహించాలని తొలుత భావించింది. మార్చి 3,4 తేదీల్లో వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 2.65 లక్షల కోట్ల నుంచి 2.75 లక్షల కోట్ల రూపాయల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్న...
మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వట్టి వసంత్ చికిత్స పొందుతూ కన్ను మూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. వట్టి వసంత్‌కుమార్ స్వస్థలం ప.గో.జిల్లా పూండ్ల. 1955లో ఆయన జన్మించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు శాసనసభ సభ్యుడు వట్టి పని చేశారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ క...