ELR: కైకలూరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొల్లేటి కోటలో వెలసిన శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలకు పోలీసులు గట్టి బందోబస్తు చర్యలను ఏర్పాటు చేశారు. శుక్రవారం కైకలూరు రూరల్ సీఐ రవికుమార్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రత చర్యలను పర్యవేక్షించారు. ఉత్సవ నిర్వహణ కొరకు 150 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు.
ప్రకాశం: మాజీ MLA అన్నా రాంబాబు మార్కాపురం YCP కార్యాలయంలో మాట్లాడారు. జులై 2026 నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని CM ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. మీరు చెప్పిన విధంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయండి. ఈ ప్రాంత ప్రజానీకమంతా రాజకీయంగా మీ వెంట ఉంటామని పేర్కొన్నారు. రాజకీయం శాశ్వతం కాదు.. మా ప్రాంతం అభివృద్ధి చెందడం నా లక్ష్యమని ఆయన తెలిపారు.
అన్నమయ్య: 1 వ తరగతి ప్రైవేటు పాఠశాలలో ఉచిత ప్రవేశం కోసం ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారని రాజంపేట MEOలు రఘునాథరాజు, డి. సుబ్బరాయుడు తెలిపారు. అందుకు సంబంధించి ప్రచార కరపత్రాలను శుక్రవారం వారు విడుదల చేశారు. అన్ని ప్రైవేటు పాఠశాలలో 2026-27 సంవత్సరానికి గాను అర్హులైన ప్రతి ఒక్కరు తమ పరిధి లోని గ్రామ సచివాలయంలో, మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
WG: ఏకీకృత కుటుంబ సర్వేను శనివారం సాయంత్రానికి వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెదమిరం క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో నిర్వహించిన గూగుల్ మీట్ సమీక్షలో ఆమె మాట్లాడారు. నిరంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నప్పటికీ, సర్వేలో ఆశించిన ప్రగతి కనిపించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
KDP: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తోందని MLA నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరులో నియోజకవర్గంలోని 53 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ. 54.81 లక్షల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఆపదలో ఉన్న పేదవారిని ఆదుకోవాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు.
KRNL: ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి రూపకల్పనలో అంగస్కల్ గ్రామంలో పోస్టర్ల ప్రచార కార్యక్రమం ఇవాళ ఉత్సాహంగా నిర్వహించారు. ఆలూరు కన్వీనర్ కటారికొండ శ్రీనివాసులు నాయకత్వంలో జరిగిన కార్యక్రమంలో కొమ్ము రాజు,సోమశేఖర్ పాల్గొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి ఆలూరు భవిష్యత్తును మార్చడమే లక్ష్యమని తెలిపారు.
ఏలూరు: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం బోటనీ , హిస్టరీ వన్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. 3,197 మంది విద్యార్థులకు 2,707 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 490 మంది పరీక్షకు గైహాజరయ్యారని దీని కారణంగా 85% హాజరు నమోదు అయిందని అధికారులు వివరించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశామన్నారు.
NTR: AP CRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన MIS ఆపరేటర్, ESM యూనిట్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, DEE-ఎలక్ట్రికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 2లోపు https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని CRDA కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. విద్యార్హత, దరఖాస్తు విధానం తదితర వివరాల కోసం వెబ్ సైట్ ను సందర్శించగలరు.
PPM: పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలోని గిరిమిత్ర హాలులో శుక్రవారం జరిగిన ‘గిరిజన పీజీఆర్ఎస్’ కార్యక్రమానికి స్పందన లభించింది. ఐటీడీఏ ఇంఛార్జ్ ప్రాజెక్ట్ అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ గిరిజనుల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 5 ప్రధాన వినతులు అధికారుల దృష్టికి వచ్చాయి. వినతులను పరిశీలించారు.
CTR: పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం రేపు (శనివారం )ఉదయం 11 గంటలకు జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ అలీమ్ బాషా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు తప్పక హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.
TPT: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం హిస్టరీ, బోటనీ పరీక్షలు జరిగాయి. తిరుపతి జిల్లాలో 58 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, మొత్తం 2,146 మంది విద్యార్థులకు గాను 1,965 మంది పరీక్షకు హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 181 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఆయన తెలియజేశారు.
ATP: పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి తన కుమారుడు జనార్థన్ రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అసెంబ్లీ హాలులో ఎమ్మెల్యే పరిటాల సునీతకు అందజేశారు. గౌరు వెంకటరెడ్డి, చరితా రెడ్డి దంపతుల ఏకైక కుమారుడు జనార్థన్ రెడ్డి వివాహం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమార్తె సనాతనితో నిశ్చయమైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా తోటి ప్రజాప్రతినిధులను పెళ్లికి ఆహ్వానించారు.
ATP: ఉరవకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 70 మంది లబ్ధిదారులకు రూ. 44,74,717 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పయ్యావుల శ్రీనివాసులు పంపిణీ చేశారు. అనంతపురంలోని తన స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
VZM: గరివిడి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు చిత్తూరు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొన్నారు. అండర్-14,17లో కుమారి శ్రీనిధి కు రజతం, భార్గవి రజితం, కీర్తి కి కాంస్యం, సాయి కి కాంస్యం పథకాలు సాధించారని ఇంఛార్జ్ హెచ్ఎం శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. జెడ్పీటీసీ సభ్యులు వాకడ శ్రీను, ఉప సర్పంచ్ కార్తీక్ అభినందించారు.
SKLM: ఉపాధ్యాయుల ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ టీ.ఎఫ్ ఉపాధ్యాయ శాఖ రాష్ట్ర కౌన్సిలర్ చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమదాలవలస ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.