• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఘనంగా ప్రారంభమైన సోమాలమ్మ అమ్మవారి జాతర

E.G: రాజమండ్రిలోని శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త గొర్రెల సురేశ్, దీపిక దంపతులు పంచామృత అభిషేకంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఆలయాన్ని విద్యుద్దీపాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.

February 27, 2026 / 07:40 AM IST

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

NLR: మనుబోలు మండలం కొమ్మలపూడి వద్ద గురువారం హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 ఏళ్ల అఖిల్ మృతి చెందాడు. నెల్లూరులో ఉపాధి కోసం బైకుపై వెళుతున్న అఖిల్, నిరంజన్లను లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిరంజన్‌కు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.

February 27, 2026 / 07:38 AM IST

గొర్రెల దాడి.. వృద్ధుడి మృతి

గొర్రెల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వృద్ధుడు గురువారం రాత్రి మృతి చెందాడు. గోళ్లతోపు గ్రామం రంగనాథపురానికి చెందిన కృష్ణప్ప, కృష్ణమ్మ దంపతులపై శనివారం అదే గ్రామానికి చెందిన తిమ్మిరెడ్డి, బాబురెడ్డి సహా ఆరుగురు కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కృష్ణప్పను బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

February 27, 2026 / 07:35 AM IST

వట్లూరు అంబేడ్కర్ గురుకుల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

ELR: వట్లూరులోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు మార్చి 1, 8 తేదీలలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి తెలిపారు. మార్చి 1న 5వ తరగతి, ఇంటర్, ఐఐటీ, నీట్ అభ్యర్థులకు.. మార్చి 8న 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

February 27, 2026 / 07:35 AM IST

నేడు ఉమా కామేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

SKLM: సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురంలో వంశధార నది తీరాన వెలసిన శ్రీ ఉమా కామేశ్వరస్వామి వారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు జి వాసు దేవశర్మ ప్రకటనలో తెలిపారు. అనంతరం మ.12 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించ బడుతుందని పేర్కొన్నారు. భక్తులు పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలన్నారు.

February 27, 2026 / 07:34 AM IST

8 ఏళ్ల బాలిక హత్య కేసులో జీవితఖైదు

KRNL: ఉలిందకొండ పీఎస్ పరిధిలో 2016లో జరిగిన 8 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితుడు బోయ గిడ్డయ్య(60)కు కర్నూలు 1వ అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి పి.కమలా దేవి జీవిత ఖైదు గురువారం విధించారు. రూ.7,000 జరిమానా, చెల్లించకపోతే అదనంగా 2 నెలలు 15 రోజులు జైలు శిక్ష విధించారు. మరో నిందితుడిని సాక్ష్యాల లోపంతో విముక్తి చేశారు.

February 27, 2026 / 07:20 AM IST

పారదర్శకంగా RTI సేవలు: VSK చక్రవర్తి

E.G: రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం సేవలు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కమిషనర్ VSK చక్రవర్తి తెలిపారు. గురువారం బిక్కవోలులోని ప్రసిద్ధ గోలింగేశ్వర, సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ గణపతి ఆలయాలను ఆయన సందర్శించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో SI రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.

February 27, 2026 / 07:20 AM IST

నేటి నుంచి విశ్వేశ్వరస్వామి కల్యాణోత్సవాలు

కోనసీమ: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ క్షేత్ర పాలకుడు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి వార్షిక దివ్య కల్యాణోత్సవాలు నేటి నుంచి ఐదు రోజులపాటు జరగనున్నట్లు ఆలయ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. 27న శుక్రవారం ధ్వజారోహణ, రాత్రి స్వామి వారి దివ్య కల్యాణోత్సవం, 3వ తేదీ మహ పూర్ణహూతి, త్రిశూల స్నానం, 4వ తేదీ స్వామివారి పుష్పయాగార్చన జరుగుతాయన్నారు.

February 27, 2026 / 07:20 AM IST

నేడు గార్లదిన్నె రైల్వే గేట్ బంద్

ATP: గార్లదిన్నె మండల కేంద్రం గార్లదిన్నె డ్యాం రోడ్డులో రైల్వే గేట్‌ను శుక్రవారం నాలుగు గంటలపాటు బంద్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తాటిచెర్ల నుంచి కల్లూరు వరకు రైల్వే ట్రాక్ మరమ్మతు చేస్తున్న నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తాత్కాలికంగా గేట్ మూసివేస్తున్నట్లు తెలిపారు.

February 27, 2026 / 07:20 AM IST

ఇఫ్తార్ విందులో భూపేశ్ రెడ్డి

KDP: మైలవరం మండలం దొమ్మర నంద్యాలలో టీడీపీ కార్యకర్త YM బాషా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జిల్లా టీడీపీ ఇంఛార్జ్ భూపేశ్ రెడ్డి పాల్గొన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం మహాత్కార్యముగా భూపేశ్ రెడ్డి అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

February 27, 2026 / 07:19 AM IST

తిరుమలలో కొత్త విధానం..!

TPT: భక్తులు ముడుపులుగా సమర్పించే చిల్లర నాణేల స్థానంలో పత్రాలు వేసేలా టీటీడీ ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. చాలామంది క్యూలైన్లలో కాయిన్స్ తీసుకెళ్లడం కష్టం అవుతోంది. ఇకపై పేమెంట్ యాప్ ద్వారా నగదు చెల్లిస్తే పత్రాన్ని ఇస్తారు. దీన్ని మీరు హుండీలో వేయవచ్చు. దీనిపై TTD బోర్డు త్వరలో నిర్ణయం తీసుకోనుంది.

February 27, 2026 / 07:15 AM IST

రేపు గురజాల అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

PLD: గురజాల నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శనివారం రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. స్థానిక చల్లగుండ్ల గార్డెన్స్‌లో సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరుగుతుందని ఆర్డీవో మతెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్ పనులు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించనున్న ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరుకావాలన్నారు.

February 27, 2026 / 07:15 AM IST

పెనమలూరులో నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

కృష్ణా: పెనమలూరు మండలంలోని కానూరు పరిధిలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు తులసీ నగర్, వరలక్ష్మిపురం కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు.

February 27, 2026 / 07:15 AM IST

సైకో కిల్లర్ దారుణ హత్య

AKP: మాడుగుల మండలం జంపిన గ్రామానికి చెందిన సీరియల్ సైకో కిల్లర్ పెచ్చేటి ఉపేంద్ర బాబును గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఉపేంద్ర బాబు ఐదు మర్డర్ కేసులలో ముద్దాయిగా ఉన్నాడు. ఇటీవల విజయనగరం జిల్లాలో దొంగతనం కేసు మీద జైలుకు వెళ్లి వచ్చి బెయిల్ మీద బయటకు వచ్చాడు. మారణాయుధాలతో ఉపేంద్ర బాబును హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం.

February 27, 2026 / 07:15 AM IST

ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

అనకాపల్లి పట్టణం గవరపాలెంలో పునర్నిర్మించిన నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని వచ్చేనెల 8వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

February 27, 2026 / 07:13 AM IST