• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కొడవలూరులో రేపు ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన

NLR: రాచర్లపాడు గ్రామంలో ఆదివారం నాడు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవిచంద్ర జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లతో కలిసి పర్యటించనున్నారు. ఇస్కో కిసాన్ సెజ్‌లో ఓ పరిశ్రమ శంకుస్థాపనలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపారు.

February 28, 2026 / 04:35 PM IST

ప్రభుత్వ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

ATP: గుత్తిలోని జిల్లా పరిషత్ ఉర్దూ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో హెచ్ఎం దౌల ఆధ్వర్యంలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థి వేసిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ వేషధారణ ఎంతగానో ఆకట్టుకుంది. ముందుగా విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు సివి రామన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

February 28, 2026 / 04:33 PM IST

వెటర్నరీ వైద్యుడిపై విచారణకు డిమాండ్

అన్నమయ్య: మదనపల్లెలో వెటర్నరీ వైద్యుడి నిర్లక్ష్యం వల్ల మూగజీవాలు మృతి చెందుతున్నాయంటూ, పూర్తి స్థాయి విచారణ జరపాలని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి బీరంగి రేవతి డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్‌లో ఆమె మాట్లాడుతూ.. డాక్టర్ సిరిల్ లారెన్స్ విధుల్లో నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.

February 28, 2026 / 04:32 PM IST

నష్టపరిహారంగా సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్కు అందజేత

E.G: కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన నక్క శ్రీనివాస్‌కు రూ.4,50,000 విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కును రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి శనివారం అందించారు. గతంలో విద్యుత్ షాక్‌కు గురై ఐదు పాడి గేదలు చనిపోయాయి. అందుకు నష్టపరిహారంగా సీఎంఆర్ఎఫ్ అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.

February 28, 2026 / 04:32 PM IST

విశాఖలో మీడియా అక్రిడిటేషన్ కార్డుల సిద్ధం

VSP: జిల్లాలో జర్నలిస్టులకు 2026–27 సంవత్సరానికి మంజూరైన మీడియా అక్రిడిటేషన్ కార్డులు పంపిణీకి సిద్ధమయ్యాయి. కార్డులు ఇప్పటికే సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. మార్చి 1 నుంచి కార్డుల పంపిణీ ప్రారంభం కానుందని వెల్లడించారు. అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సు పాసుల జారీ కూడా మార్చి 2 నుంచి పొందవచ్చు.

February 28, 2026 / 04:30 PM IST

గోపాల సాగరం అభివృద్ధికి నిధులు విడుదల

SKLM: మందస మండల పరిధిలో ఉన్న గోపాల సాగర అభివృద్ధి కొరకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష విన్నపం మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల నిధులు మంజూరు చేసింది. విషయం తెలుసుకున్న స్థానిక నేతలు గోపాల సాగర పరిసరాలను శనివారం పరిశీలించారు. పట్టణ ప్రజలు సేద తీరేందుకు పార్క్‌తో పాటు పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లకు నిధులు వినియోగిస్తామని తెలిపారు.

February 28, 2026 / 04:30 PM IST

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

AKP: మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. శనివారం మాడుగుల మండలం ఎం.కోడూరులో సమావేశం నిర్వహించారు. గ్రామ సమస్యలను పరిశీలించి ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, బస్సులు ఆగే ఏర్పాట్లు, అసంపూర్తి కుళాయి పనులు పూర్తి చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

February 28, 2026 / 04:30 PM IST

తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NTR: కొత్తనాగులూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బాల ఆరేటమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

February 28, 2026 / 04:29 PM IST

‘ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించండి’

ELR: ఉంగుటూరు మండలంలో ఇంటి పన్ను, కుళాయి పన్నులు వసూళ్లను పంచాయితీ అభివృద్ధి అధికారులు వేగవంతమయ్యాయని డిప్యూటీ ఎంపీడీవో జీ. రమేష్ బాబు అన్నారు. శనివారం ఆయన ఉంగుటూరులో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వసూలు చేస్తున్న ఇంటి పన్ను, కుళాయి పన్నును పరిశీలించారు. ఇంటి పనులను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు.

February 28, 2026 / 04:28 PM IST

రైలు ఢీకొని వృద్ధురాలు మృతి.!

ELR: రైలు ఢీకొనడంతో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన సీతంపేట రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. దెందులూరు-భీమడోలు మధ్య పట్టాలు దాటుతున్న వృద్ధురాలిని రైలు ఢీకొట్టినట్లు రైల్వే పోలీసులు దృవీకరించారు. మృతురాలు 70 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటుందని తెలిపారు. వివరాలు తెలిసినవారు రైల్వే హెచ్‌సీ ప్రసాద్‌ను సంప్రదించాలని కోరారు.

February 28, 2026 / 04:27 PM IST

అంబేద్కర్ నూతన కాంశ్య విగ్రహ ఏర్పాట్ల పరిశీలన

కనిగిరిలోని ఒంగోలు బస్టాండ్ వద్ద ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నూతన కాంశ్య విగ్రహ పనులను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పరిశీలించారు. విగ్రహ స్థాపన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయడం మనందరి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

February 28, 2026 / 04:24 PM IST

వాసవ్య మహిళా మండలి వృత్తి శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ

KKD: పిఠాపురం పురపాలక సంఘం మెప్మా ఆఫీసులో వాసవ్యమహిళా మండలి ఆధ్వర్యంలో సోలార్ పీవీ టెక్నాలజికల్ ట్రైనింగ్ జరిగింది. 14 రోజుల పాటు మహిళలకు ఉచిత శిక్షణ ఇచ్చారు. ఈ కోర్సు పూర్తయిన వారికి వాసవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ కీర్తి 50 మందికి సర్టిఫికెట్స్, కిట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో CMM వేంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 04:17 PM IST

ఆకివీడులో ఫోక్సో కేసు నమోదు

W.G: ఆకివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. సమతా నగర్ ప్రాంతానికి చెందిన పాల మరియమ్మ కుమార్తె(మైనర్ బాలిక)ను అదే ప్రాంతానికి చెందిన బోనాల రాము పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు శారీరకంగా కలిసినట్లు ఎస్సై తెలిపారు. పెళ్లికి నిరాకరించడంతో తల్లిపాల మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో రాముపై ఫోక్సో కేసు నమోదు చేశారు.

February 28, 2026 / 04:17 PM IST

పోలీస్ శాఖకి ఆయన చేసిన సేవలు ప్రశంసనీయం

చిత్తూరు ఎస్పీ తుషార్ దూడి ఆదేశాల మేరకు పూతలపట్టు పోలీస్ స్టేషన్ నుంచి పదవీ విరమణ పొందిన ASI శేఖర్‌ను పోలీసులు సత్కరించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ S.R. రాజశేఖర రాజు, AR అదనపు ఎస్పీ దేవదాస్, ఆయన 39 సంవత్సరాల అంకితభావం, క్రమశిక్షణతో కూడిన సేవను ప్రశంసించారు. ఆయన నిబద్ధత, త్యాగాన్ని ప్రశంసించి ఆయన చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు.

February 28, 2026 / 04:16 PM IST

కంభంలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక అర్బన్ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

February 28, 2026 / 04:13 PM IST