• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వేట్లపాలెం ఘటన పై మంత్రి స్వామి దిగ్భ్రాంతి

ప్రకాశం: వేట్లపాలెం పేలుడు ఘటనపై మంత్రి స్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 24 మంది మృత్యువాత పడటం దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారికి ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తుందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

March 1, 2026 / 07:54 AM IST

రోజా కుమార్తెకు లీడర్ షిప్ అవార్డు

CTR: వైసీపీ నేత ఆర్కే రోజా కుమార్తె అన్హు మాలికకు అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ అవుట్ స్టాండింగ్ లీడర్‌షిప్ అవార్డును శనివారం ప్రదానం చేసింది. బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ కోర్సు చదువుతున్న అనుమాలిక రచయిత్రి కూడా. ఆమె రచించిన ‘ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్’ అనే నవల ప్రశంసలందుకుంది. కుమార్తె అవార్డు అందుకోవడంపై రోజా ఆనందాన్ని వ్యక్తం చేశారు.

March 1, 2026 / 07:49 AM IST

‘గంజాయి సాగుపై నిఘా ఉంచలి’: కలెక్టర్

కర్నూలు: జిల్లా కలెక్టర్ సిరి మత్తు పదార్థాల రవాణా, వినియోగాన్ని అరికట్టాలని అధికారులను శనివారం ఆదేశించారు. కలెక్టరేట్ NCORD సమావేశంలో విద్యాసంస్థల వద్ద కఠిన నిఘా, RTC బస్సుల్లో అక్రమ రవాణా నిరోధం జారీ చేయాలన్నారు. జనవరి నుంచి 2 కేసులు నమోదు, 1.350 కిలోల గంజాయి స్వాధీనం. రెవెన్యూ, పోలీస్ శాఖలను గంజాయి సాగుపై నిఘా ఉంచమని కలెక్టర్ సూచించారు.

March 1, 2026 / 07:48 AM IST

జాయింట్ కలెక్టర్ కీలక ఆదేశాలు

W.G. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. భీమవరం కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు పట్టణాల్లో తాగునీటి సరఫరా నిరంతరాయంగా ఉండేలా నీటి నిల్వలు, పంపింగ్ స్టేషన్లు, పైప్‌లైన్ మరమ్మతులపై దృష్టి పెట్టాలన్నారు.

March 1, 2026 / 07:44 AM IST

రోడ్డు ప్రమాదంలో చేనేత కార్మికులకు గాయాలు

అన్నమయ్య: మదనపల్లి సమీపంలోని CTM వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నీరుగట్టువారిపల్లికి చెందిన చేనేత కార్మికులు వెంకటరమణ, రమేష్ తీవ్రంగా గాయపడ్డారు. తరిగొండ లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా, వేగంగా వచ్చిన కారు వీరి బైకును ఢీకొట్టింది. బాధితులను వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

March 1, 2026 / 07:41 AM IST

దేవరంపాడు వెంకన్న ఆలయానికి భారీ ఆదాయం

PLD: దేవరంపాడులోని శ్రీ మత్స్యావతార నేతి వెంకన్న స్వామి ఆలయంలో రెండో శనివారం ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. వేడుకల అనంతరం ఆలయ కమిషనర్ డి. చంద్రశేఖర్ పర్యవేక్షణలో అధికారులు హుండీ కానుకలను లెక్కించారు. ఈ లెక్కింపులో హుండీ ద్వారా రూ. 6,08,489, దర్శన టిక్కెట్ల ద్వారా రూ. 4,22,220 ఆదాయం వచ్చినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

March 1, 2026 / 07:40 AM IST

నేడు ఒంటిమిట్టలో ఉచిత వైద్య శిబిరం

KDP: ఒంటిమిట్ట బస్టాండ్ ప్రాంతంలో ఉన్న కేర్ ఆస్పత్రిలో ఆదివారం శ్రీనివాస వైద్యాలయం ఆధ్వర్యంలో ఉచిత వైద్య మెగా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ గౌరీ తెలిపారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 1, 2026 / 07:40 AM IST

కర్రలతో దాడి.. కోమాలో చేరిన వ్యక్తి

VSP: నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి బుక్కా వీధిలో మైలిపిల్లి సాగర్, అతని కుటుంబ సభ్యులపై ఓ గొడవ నేపథ్యంలో యజ్ఞ నీలవేణి, ఆమె కుమారులు శనివారం రాత్రి కర్రలతో దాడి చేశారు. దీంతో సాగర్ కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కేజీహెచ్‌లో చేర్పించగా సాగర్ సోదరుడు కోమాలోకి చేరాడు. ఘటనపై సీఐ వరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 1, 2026 / 07:34 AM IST

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

TPT: పెళ్లకూరు మండలంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 14,34,400 విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు నాయుడుపేట రూరల్ సీఐ తెలిపారు. అలాగే పలుచోట్ల చోరీలకు పాల్పడినట్లు విచారణలో బయటపడింది. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

March 1, 2026 / 07:32 AM IST

జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

GNTR: తెనాలిలో శనివారం రాత్రి జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. సభ్యత్వం ఉన్న కార్యకర్తలు ఎవరైనా సహజ మరణం పొందితే వారి కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఇందులో పవన్ కళ్యాణ్ తరపున రూ. 50 వేలు, స్థానిక నాయకత్వం ద్వారా మరో రూ. 50వేలు అందజేస్తామని, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.

March 1, 2026 / 07:32 AM IST

నరసరావుపేటలో నేటి చికెన్ ధరలు ఇవే..!

PLD: నరసరావుపేటలో ఆదివారం స్కిన్‌లెస్ చికెన్ ధర కిలో రూ. 240 నుంచి రూ. 260 వరకు, స్కిన్‌తో ఉన్న చికెన్ ధర రూ. 220 నుంచి రూ. 240 వరకు ఉంది. ఇక లైవ్ కోడి రూ. 140కి, పెద్ద బాయిలర్ రూ. 260 నుంచి రూ. 280కి లభిస్తున్నాయి. అలాగే మటన్ ధర రూ. 850 నుంచి రూ. 1000 వరకు ఉండగా, 100 కోడిగుడ్ల ధర రూ. 500గా ఉంది. ప్రాంతాలను బట్టి […]

March 1, 2026 / 07:32 AM IST

జిల్లాలో నేటి మాంసం ధరలు ఇవే..!

SKLM: జిల్లాలో చికెన్, మటన్ ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి. చికెన్ లైవ్ రూ.170, విత్ స్కిన్ రూ.220, స్కిన్ లెస్ రూ.260గా విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.900లకు విక్రయిస్తున్నట్లు వ్యాపారస్తులు తెలిపారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులున్నా యని విక్రయదారులు చెబుతున్నారు. ఆదివారం కావడంతో మాంసం వినియోగదారులతో దుకాణాలు కళకళలాడుతున్నాయి.

March 1, 2026 / 07:32 AM IST

టీడీపీ ఇంఛార్జ్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్

KRNL: ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో మనేకుర్తిలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరి సమస్యలు నేరుగా తెలిపారు. కొన్నింటిని అక్కడే పరిష్కరించారు, మిగతా సమస్యలకు త్వరిత పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటామని, సమస్యలు ఉంటే తెలియజేయాలని పేర్కొన్నారు.

March 1, 2026 / 07:30 AM IST

విశాఖలో కేజీ చికెన్ ఎంతంటే ?

విశాఖలో మాంసం దుకాణాల వద్ద ఆదివారం కావడంతో రద్దీ ఎక్కువగా ఉంది. పెందుర్తి, గోపాలపట్నం, గాజువాక తదితర ప్రాంతాల్లో ఈ రోజు కేజీ మటన్ రూ.1000లకు విక్రయిస్తున్నారు. చికెన్ స్కిన్ లెస్ రూ.300, విత్ స్కిన్ రూ.280, చికెన్ లైవ్ రూ.185, సొంట్యాం రూ.320, గుడ్లు డజను రూ.70లుగా ఉన్నాయి. మరి మీ ప్రాంతంలో ఎంతకు అమ్ముతున్నారో కామెంట్ చేయండి.

March 1, 2026 / 07:27 AM IST

టీటీడీ హాల్ ఈవోగా ముద్దాడ రవిచంద్ర

TPT: ప్రభుత్వం జారీ చేసిన జీ.వో.ఆర్.టీ.నం.494 ప్రకారం ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. అయితే సాయి ప్రసాద్‌కు వాటర్ రిసోర్సెస్, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూరి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ముద్దాడ రవిచంద్ర టీటీడీ పూర్తి బాధ్యతలను స్వీకరించారు.

March 1, 2026 / 07:26 AM IST