• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవు: సీఐ

KDP: అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కఠినమైన చర్యలు తప్పవని CI నరసింహారాజు హెచ్చరించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు గ్రామాలలో కిరాణా షాపులలో ఎటువంటి అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకొని కిరాణా షాపుల యజమానులు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

March 2, 2026 / 05:20 PM IST

జనసేన సభ్యత్వ నమోదులో పాల్గొన్న ఎంపీ

KKD: అన్నవరం వేదికగా మేడిశెట్టి సూర్య కిరణ్ బాబి ఆధ్వర్యంలో ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MP ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరెంట్ షాక్‌తో మరణించిన గిడజాం జనసైనికుడు యర్రా నాగేశ్వరరావు భార్య సోమిరెడ్డి కుశరాజు సాయంతో ఎంపీని ఆశ్రయించారు. వివరాలు తెలుసుకున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బాధితురాలికి న్యాయం చేస్తామన్నారు.

March 2, 2026 / 05:20 PM IST

వాహనాల లైట్లకు బ్లాక్ స్టిక్కర్స్ అతికించాలని వినతి

E.G: వాహనాల LED లైట్ల కారణంగా అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రతి వాహనం లైట్లకు బ్లాక్ స్టిక్కర్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి ఎస్.గిరీష్ కోరారు. సోమవారం రాజమండ్రి ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ సత్తిబాబుకు వినతి పత్రం అందించారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.

March 2, 2026 / 05:20 PM IST

‘తెలుగు భాష నన్ను ఐపీఎస్ సాధించే విధంగా చేసింది’

AKP: తాను అభ్యసించిన తెలుగు భాష ద్వారా ఐపీఎస్ సాధించగలిగానని యూపీ రాష్ట్రం మాజీ ఎడిషనల్ డిజిపి కిల్లాడ సత్యనారాయణ సోమవారం నర్సీపట్నంలో పేర్కొన్నారు. ఇంగ్లీష్ మాధ్యమం ద్వారా సివిల్ సర్వీసెస్ పరీక్షలు నాలుగు సార్లు రాస్తే మెయిన్స్‌లో ఫెయిల్ అవ్వడం జరిగిందన్నారు. ఐదోసారి తెలుగులో రాసి ఐపీఎస్ కి ఎంపిక అయ్యానన్నారు. మన భావ వ్యక్తీకరణకు భాష ముఖ్యమైనది అన్నారు.

March 2, 2026 / 05:19 PM IST

ప్రజా ఫిర్యాదుల వేదికకు 33 వినతులు

TPT: తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 33 వినతులు అందాయని కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. 23 మంది ప్రత్యక్షంగా,10 మంది ఫోన్ ద్వారా సమస్యలు తెలియజేశారు. డిప్యూటీ మేయర్ ఆర్.సి. మునికృష్ణ వార్డుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమస్యలపై అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

March 2, 2026 / 05:18 PM IST

రేపు సెలవు.. ఎల్లుండి యధావిధిగా నిర్వహణ

ATP: జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర గణితం పరీక్షకు 15,740 మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ విభాగంలో 269 మంది, ఒకేషనల్‌లో 139 మంది గైర్హాజరైనట్లు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వెంకటరమణ నాయక్ తెలిపారు. అలాగే హోలీ పండుగ సందర్భంగా మంగళవారం పరీక్ష ఉండదని, టైమ్ టేబుల్ ప్రకారం మార్చి 4 నుంచి పరీక్షలు యధావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు.

March 2, 2026 / 05:15 PM IST

పీజీఆర్ఎస్‌కి విశేష స్పందన

VZM: సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’, ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. అందిన మొత్తం 200 వినతుల్లో అత్యధికంగా 95 రెవెన్యూ శాఖవే ఉన్నాయి. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ వినతుల పరిష్కారంలో వేగం పెంచాలని, వినతులు పరిష్కారంలో సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

March 2, 2026 / 05:14 PM IST

చెస్ పోటీల్లో మొదటి స్థానంలో జిల్లా వాసి

AKP: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి లీగ్ చెస్ పోటీల్లో అండర్ 15 విభాగంలో అనకాపల్లి జిల్లాకు చెందిన బి శ్రావ్యశ్రీ మొదటి స్థానంలో నిలిచింది. అండర్ 13 విభాగంలో బి. సహస్ర, అండర్ 17 విభాగంలో వి. వెంకటేశ్వరరావు మూడో స్థానం సాధించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పూజారి శైలజను జాయింట్ కలెక్టర్ అభినందించారు.

March 2, 2026 / 05:13 PM IST

‘ఐవీఆర్ఎస్ కాల్స్‌కు స్పందించాలి’

ASR: ప్రభుత్వం నుంచి వచ్చే ఐవీఆర్ఎస్ కాల్స్‌కు తప్పకుండా స్పందించాలని కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు ప్రజలను కోరారు. ఆయన సోమవారం రావణాపల్లిలో పర్యటించారు. పంచాయతీలో పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. చెత్త సేకరణ కార్యక్రమం పక్కాగా అమలు చేయాలన్నారు.

March 2, 2026 / 05:12 PM IST

‘పీజీఆర్ఎస్‌కు 54 ఫిర్యాదులు’

CTR: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 54 ఫిర్యాదుల అందినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 7, భూతగాదాలు 23 ఫిర్యాదులు అందాయన్నారు.

March 2, 2026 / 05:11 PM IST

పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యత: ఎంపీ

VSP: పేదల ఆరోగ్యానికి అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందిస్తున్నామని ఎంపీ శ్రీ భరత్ అన్నారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు చెందిన పలువురు అత్యవసర చికిత్స నిమిత్తం ఎంపీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోగా 22 లక్షల పైగా మంజూరైన సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను బాధితులకు ఎంపీ చేతుల మీదుగా అందజేశారు.

March 2, 2026 / 05:11 PM IST

‘ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి’

VZM: ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అతిది విజయలక్ష్మి గజపతిరాజు కలిసి వినతిపత్రం అందించారు. ఆర్టీసీలో థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి నేరుగా ఆర్టీసీ సంస్థ నుంచి జీతం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని పబ్లిక్ సెక్రెటరీ అశోక్‌ కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ఈ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

March 2, 2026 / 05:06 PM IST

విగ్రహాల పునః ప్రతిష్టకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

NTR: తిరువూరు(M) అక్కపాలెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ నాభిశిలాంబ శ్రీ ముత్యాలమ్మ తల్లి, మహాలక్ష్మి తల్లి, పోతురాజు స్వామి వార్ల విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవం ఈనెల 8వ తారీఖున నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును వ్యక్తిగత ఆఫీసులో కమిటీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కమిటీ సభ్యులు నాగిరెడ్డి సోమవారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

March 2, 2026 / 05:05 PM IST

అక్షరాంధ్ర పరీక్షలకు అంతా సిద్ధం కావాలి: కలెక్టర్

W:G: జిల్లాలో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పరీక్షలకు రిజిస్టర్ అయిన వారందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్ నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో ఆమె వెచ్ఎక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

March 2, 2026 / 05:04 PM IST

‘జనసేన పార్టీ బలోపేతానికి కృషి’

KRNL: గ్రామాల్లో జనసేన పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినట్లు సొసైటీ డైరెక్టర్, జనసేన పార్టీ మండల నాయకులు హనుమేష్ స్పష్టం చేశారు. సోమవారం పెద్దకడబూరులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోనే గ్రామాభివృద్ధి సాధ్యమని అన్నారు.

March 2, 2026 / 05:00 PM IST