W.G. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. భీమవరం కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు పట్టణాల్లో తాగునీటి సరఫరా నిరంతరాయంగా ఉండేలా నీటి నిల్వలు, పంపింగ్ స్టేషన్లు, పైప్లైన్ మరమ్మతులపై దృష్టి పెట్టాలన్నారు.