• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

28న ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు విద్యుత్ సబ్ స్టేషన్ పరిదిలో శనివారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు గొల్లగూడెం ఏ ఈ వేణు తెలిపారు. ఆ మేరకు ఆయన శుక్రవారం తెలిపారు. చెట్టు కొమ్మల తొలగింపు, మరమ్మతుల కొరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగును, వినియోగదారుల సహకరించాలని ఆయన కోరారు.

February 27, 2026 / 01:40 PM IST

బొలెరో వాహనం బోల్తా పడిన ఘటనపై ఎంపీ స్పందన

KRNL: ఆస్పరి మండలం పుటకలమర్రి వద్ద కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడిన ఘటనపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఇవాళ స్పందించారు. విజయవాడలో ఉన్న ఆయన ఫోన్‌లో అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. దాదాపు 20 మంది గాయపడటం బాధాకరమని, వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

February 27, 2026 / 01:38 PM IST

సీఎం చంద్రబాబును ఆహ్వానించిన భట్టి విక్రమార్క

GNTR: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి రావాల్సిందిగా భట్టి విక్రమార్క సీఎంను కోరారు. ఈ మేరకు వివాహ శుభలేఖను అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ వివాహ వేడుక మార్చి 5వ తేదీన హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సందర్భంగా నేతల మధ్య ఆత్మీయ సంభాషణ సాగింది.

February 27, 2026 / 01:31 PM IST

అనంతసాగరం తహసీల్దార్ సస్పెన్షన్

NLR: అనంతసాగరంలో తహసీల్దార్ జయవర్ధన్‌ను సస్పెండ్ చేశారు. మండల కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగిని తీవ్రంగా వేధించి, లైంగికంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు ఆర్డీవోకు ఫిర్యాదు చేయడంతో, విచారణ అనంతరం తహసీల్దార్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. ఈ నివేదిక ఆధారంగా కలెక్టర్ జయవర్ధన్‌ను సస్పెండ్ చేశారు.

February 27, 2026 / 01:29 PM IST

అంగన్వాడి కేంద్రంపై ఆకస్మిక తనిఖీలు

ప్రకాశం: పామూరు మండలం పమటకటకిందపల్లి గ్రామంలోని అంగన్వాడి కార్యాలయాన్ని శుక్రవారం తాసిల్దార్ వాసుదేవరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అంగన్వాడి కేంద్రంలో పిల్లల హాజరు నమోదులు, పోషకాహార పంపిణీ, చిన్నారుల హాజరు వివరాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఏఎంసి ఛైర్మన్ యారవ రమ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

February 27, 2026 / 01:28 PM IST

రేపే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

AKP: ఈనెల 28న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని నాతవరం ఎంపీడీవో ఎంఎస్.శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. మార్చి 1న ఆదివారం రావడంతో ఒక్కరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. మండలంలో మొత్తం 10,932 మంది పింఛన్ దారులు ఉన్నారని, వీరికి గాను రూ.4.59కోట్లు మంజూరు అయిందన్నారు.

February 27, 2026 / 01:28 PM IST

పత్తికొండలో విద్యార్థులకు నోట్‌బుక్‌ల పంపిణీ

KRNL: నూతన సంవత్సరం సందర్భంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పత్తికొండ పట్టణంలోని ఆది ఆంధ్ర స్కూల్లో విద్యార్థులకు నోట్‌బుక్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నారాయణదాసు, సోమశేఖర్, శ్రీరంగడు, కారం నాగరాజు, టీఎండీ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

February 27, 2026 / 01:27 PM IST

పెనుమూరులో యువకుడి ఆత్మహత్య

CTR: పెనుమూరు మండలంలో ఓ యువకుడు గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. గుట్టకింద పల్లికి చెందిన రవి కుమారుడు దిలీప్ (26) గతంలో యాక్సిడెంట్ జరిగింది. దవడ గాయమై కోలుకోలేకపోతున్నాడు. ఇటీవల వ్యాపారాలు చేస్తే నష్టపోయాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది అమ్మమ్మ ఊరైన అట్టలవారిపల్లిలో ఉరేసుకున్నాడు.ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు.

February 27, 2026 / 01:26 PM IST

చెరువులో మృతదేహం లభ్యం

NDL: పాణ్యం గ్రామానికి చెందిన మంగలి వెంకటసుబ్బయ్య (62) మృతదేహం శుక్రవారం గ్రామ శివారులోని చెరువులో లభ్యమైంది. నీటిలో శవం తేలుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు రామసుబ్బయ్య కుమారుడిగా గుర్తించారు.

February 27, 2026 / 01:25 PM IST

జీడీనెల్లూరులో 10,713 మందికి పెన్షన్లు

CTR: జీడీనెల్లూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు శనివారం పంపిణీ చేయునట్లు ఎంపీడీవో మనోహర్ గౌడ్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒకటో తేదీ ఆదివారం కావడంతో ముందు రోజే పంపిణీ చేస్తామన్నారు. మండలంలో 10,713 మంది లబ్ధిదారులకు రూ.46,01,4500 అందిస్తామన్నారు.

February 27, 2026 / 01:23 PM IST

వైసీపీపై జనసేన ఎమ్మెల్యే ఫైర్

నెల్లూరు: వైసీపీ ప్రభుత్వంలో విధ్వంసం, అవినీతి తప్ప అభివృద్ధి శూన్యమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. కోవూరులోని జనసేన కార్యాలయంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్వీర్యంతో పాటు, గంజాయి రవాణా చేసిందన్పనారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.

February 27, 2026 / 01:22 PM IST

నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

కృష్ణా: మోపిదేవి మండలం కే.కొత్తపాలెంలో శుక్రవారం నూతన సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. గౌడపాలెంలో రూ.10.65 లక్షలు అంచనాతో 165 మీటర్లు పొడవైన్ అంతర్గత రహదారి నిర్మాణ పనులను సర్పంచ్ కొక్కిలిగడ్డ మాధవి శుక్రవారం ప్రారంభించారు. నాయకులు రావి రత్నగిరి, చందన రంగారావు, నాగాయతిప్ప సొసైటీ ఛైర్మన్ బల్లా సీతారామ ప్రసాద్, బాల కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

February 27, 2026 / 01:20 PM IST

ఏప్రిల్ 1 నుంచి ‘వీబీజీ రామ్ జీ’ నూతన చట్టం అమలు

KRNL: ఏప్రిల్ 1 నుంచి ‘వికసిత్ భారత్ జి రామ్ జీ’ (VBG Ram Ji) నూతన చట్టం అమల్లోకి వస్తుందని పెద్దకడబూరు APO చంద్రశేఖర్ తెలిపారు. ఇవాళ MPDO కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచినట్లు పేర్కొన్నారు. వేతనాల చెల్లింపు ఆలస్యమైతే వడ్డీతో కలిపి ఇస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు లక్ష్మన్న ఉన్నారు.

February 27, 2026 / 01:15 PM IST

మెడికల్ మాఫియాపై రేపు సీపీఐ నిరసన

GNTR: వైద్య రంగంలో మాఫియా ఆగడాలకు వ్యతిరేకంగా రేపు డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టనున్నట్లు సీపీఐ నేతలు అరుణ్, అంజిబాబు తెలిపారు. శుక్రవారం కొత్తపేటలో మాట్లాడుతూ..పేదలపై వైద్య భారం పెరిగిపోయిందని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో మాఫియా ఆగడాలు మితిమీరాయని విమర్శించారు. కావున మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా రేపు ప్రజా సంఘాలు తమ గళాన్ని వినిపించాలని కోరారు.

February 27, 2026 / 01:15 PM IST

గ్రంథాలయాల ఆధునీకరణపై ఛైర్మన్ కీలక చర్చ

ATP: రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ కోటేశ్వరరావుతో ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వడ్డే వెంకట్ తాడేపల్లిలో భేటీ అయ్యారు. జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధి, భవనాల మరమ్మతులు, నూతన పుస్తకాల కొనుగోలుకు నిధులు కేటాయించాలని కోరారు. పారదర్శకత కోసం సిబ్బందికి ఫేస్ రికగ్నైజేషన్ హాజరు విధానం అమలు చేయాలని ప్రతిపాదించారు.

February 27, 2026 / 01:13 PM IST