• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కర్నూలు కూటమి నేతలకు లోకేష్ విందు

కర్నూలు పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి నారా లోకేష్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి, ఎమ్మిగనూరు MLA బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి, ఆదోని MLA పార్థసారధి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. వివిధ సమస్యలపై తనకు అందిన దరఖాస్తుల స్థితిని మంత్రి వివరించారు.

February 27, 2026 / 07:10 AM IST

బాపట్లలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. 40 బైకులు స్వాధీనం

BPT: బాపట్ల డివిజన్ పరిధిలో గురువారం పోలీసులు విస్తృతంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.తనిఖీల్లో భాగంగా నిబంధనలు లేని 40ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఇందులో బాపట్ల పట్టణంలో 10, రూరల్ పరిధిలో 3, చందోలులో 3, కర్లపాలెంలో 5, పర్చూరులో 12, యద్దనపూడిలో 7 బైకులు ఉన్నాయి. వీటితో పాటు అక్రమంగా నిల్వ ఉంచిన 47 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు.

February 27, 2026 / 07:07 AM IST

శ్రీ కొత్తూరు క్షేత్రలో వైభవంగా ఏకాదశి పూజలు

NDL: పాణ్యం మండలం శ్రీ కొత్తూరులో వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి క్షేత్రాల్లో పాల్గొనమాస ఏకాదశి పూజలు శుక్రవారం ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున నుంచి వేద పండితులు శాస్త్రోక్తంగా కుంకుమార్చన రుద్రాభిషేకం గణపతి పూజ పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఏకాదశి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు.

February 27, 2026 / 07:04 AM IST

ఈవీఎంలు భద్రత ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

NTR: విజయవాడ గొల్లపూడిలో జిల్లా ఎన్నికల గోదాంను సందర్శించి ఈవీఎంలు వీవీప్యాట్ యంత్రాల భద్రత ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీశ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాములో ఏర్పాటు చేసిన సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థ, అగ్నిమాపక పరికరాలు, విద్యుత్ వ్యవస్థను తనిఖీ చేసి, రిజిస్టర్ తదితర అంశాలను సమగ్రంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

February 27, 2026 / 07:03 AM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన MLA

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గళ్లా మాధవి స్పష్టం చేశారు. గురువారం రాత్రి శ్రీనివాసరావుపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆమె 36 మంది లబ్ధిదారులకు రూ. 39,96,998 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు.నియోజకవర్గంలో ఇప్పటివరకు 464 మందికి రూ. 6 కోట్ల పైచిలుకు ఆర్ధిక సాయం అందించామన్నారు.

February 27, 2026 / 07:02 AM IST

ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపనగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దక్షిణ భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి విగ్రహాన్ని ఫల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత పసుపు, కుంకుమ, వెండి కిరీటంతో పాటు వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులు దర్శించుకున్నారు.

February 27, 2026 / 07:01 AM IST

‘రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేయాలి’

కోనసీమ: జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు ప్రారంభం సందర్భంగా గురువారం బోడసకుర్రు BRK కన్వెన్షన్‌లో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ నేతల సమావేశం జరిగింది. రాజానగరం MLA బలరామకృష్ణ, రాజోలు MLA దేవ వరప్రసాద్, కొత్తపేట ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

February 27, 2026 / 07:00 AM IST

జనగణన శిక్షణా కార్యక్రమం పూర్తి: కలెక్టర్

సత్యసాయి: బీడుపల్లిలోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజుల పాటు జరిగిన ‘జనగణన-2027’ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు గురువారంతో ముగిశాయి. ముగింపు సభలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈసారి జనగణనలో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని, క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన గణాంకాలు సేకరించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

February 27, 2026 / 07:00 AM IST

పలు సమస్యలపై సీఎంను కలిసిన ఎమ్మెల్యే శ్రావణి

ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణి అసెంబ్లీలో CM చంద్రబాబు నాయుడును కలిశారు. నియోజకవర్గంలోని సాగునీటి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మిడ్ పెన్నారు దక్షిణ కాలువ ఆధునికీకరణ, నిలిచిపోయిన బైపాస్ కాలువ పనులను త్వరగా ప్రారంభించాలని కోరారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి రాకుండా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

February 27, 2026 / 07:00 AM IST

మార్చి 7న పెళ్లి.. ఇంతలో యువతి అదృశ్యం

KKD: బోద్దవరం గ్రామానికి చెందిన అదారి జయశ్రీ వెంకట సత్య సాయి రేణుక (21) అదృశ్యంపై కేసు నమోదైనట్లు SI రామకృష్ణ గురువారం తెలిపారు. మార్చి 7న వివాహం జరగాల్సి ఉండగా.. ఐదు తులాలు బంగారం, వెండి, రూ. 50 వేల నగదుతో ఆమె కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. విశాఖలో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న రేణుక ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందుతున్నారు.

February 27, 2026 / 07:00 AM IST

‘కంసాలిపాలెంలో శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి’

E.G: నిడదవోలు మండలం కంసాలిపాలెంలో శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేస్తామని BJP జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తెలిపారు. గురువారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. గ్రామంలోని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంసాలిపాలెంలో శ్మశాన వాటిక సమస్యను ఎంపీ పురందీశ్వరి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

February 27, 2026 / 07:00 AM IST

నాసా పరీక్షలో పులివెందుల విద్యార్థి ప్రతిభ

KDP: ఇటీవల నిర్వహించిన నాసా (ఎన్ఎస్‌వో) పరీక్షలో పులివెందుల విద్యార్థిని మెహరీన్ అంజు ప్రతిభను చాటుకుంది. రెండో తరగతి చదువుతున్న ఆమె రాష్ట్ర స్థాయిలో 98వ ర్యాంకు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. ఇంతటి ప్రతిభ కనబరిచిన మెహరీన్ అంజు విజయానికి ఆమె కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకం కీలకంగా మారాయి.

February 27, 2026 / 06:55 AM IST

స్కూల్ బస్సులు తనిఖీ చేసిన ట్రాఫిక్ పోలీసులు

అనకాపల్లిలో ప్రైవేట్ పాఠశాలలు కళాశాలకు విద్యార్థులను తీసుకువెళ్లే స్కూల్ బస్సులు, ఆటోలను గురువారం తనిఖీలు నిర్వహించారు. డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ తెలిపారు. డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలను వివరించారు.

February 27, 2026 / 06:53 AM IST

మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

ఏలూరు పవర్‌పేట రైల్వే స్టేషన్‌లో రైలు సమీపిస్తున్న సమయంలో ఒక మహిళ ట్రాక్‌పైకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. ప్రమాదాన్ని గమనించిన కమ్యూనికేషన్ కానిస్టేబుల్ డేవిడ్ వెంటనే ట్రాక్‌పైకి దిగి ఆమెను పక్కకు లాగి ప్రాణాలు కాపాడారు. రైలు దగ్గర్లోనే ఉన్నప్పటికీ తన ప్రాణాలను లెక్కచేయకుండా స్పందించారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

February 27, 2026 / 06:42 AM IST

నేడు రాజమండ్రి రూరల్ పరిధిలో పవర్ కట్

E.G: రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరులో RDSS పనుల నిమిత్తం శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కళ్యాణ్ నగర్, ఆదర్శ్ నగర్, జంగాల కాలనీ, ఉద్యోగుల కాలనీ, క్వారీ ప్రాంతం, నూకాలమ్మ గుడి, ముస్లిం పేట, అఫీషియల్ కాలనీలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

February 27, 2026 / 06:40 AM IST