సత్యసాయి: పెనుకొండలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్‌ను మంత్రి సవిత ఏర్పాటు చేయించారు. పట్టణంలో బస్సుల కోసం ఎదురుచూసే ప్రయాణికులు ఎండల నుంచి రక్షణ పొందేందుకు ఈ బస్సు షెల్టర్ ఉపయోగపడుతుందని స్థానికులు తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయాన్ని కల్పించినందుకు మంత్రి సవితకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.
NLR: ప్రజలు ఇంటి పన్నులు సకాలంలో చెల్లించి పంచాయతీలకు సహకరించాలని బుచ్చి ఎంపీడీవో రంతులయ్య కోరారు. ఇసుకపాలెం, మునులపూడిలో పంచాయతీ కార్యదర్శులు సిబ్బందితో కలిసి మంగళవారం ఇంటి పన్ను వసూళ్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్దేశించిన కాలంలో సిబ్బంది ప్రజల నుంచి ఇంటి పనులు వసూలు చేయాలని ఆయన సూచించారు.
KRNL: ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక జిల్లా సాధన ఉద్యమ గాయకుడు మేలన్న గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి జేఏసీ నాయకులు ఇవాళ రూ.5,000 సాయం అందించారు. ఆయన మరణానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జేఏసీ నాయకులు ఆరోపిస్తూ.. రూ.10 లక్షల పరిహారంతో పాటు, ఆదోని జిల్లాను వెంటనే ప్రకటించాలని 108వ రిలే నిరాహార దీక్షలో నేతలు డిమాండ్ చేశారు.
W.G: ఆపదలో ఉన్నవారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తూ సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. మంగళవారం భీమవరం టీడీపీ కార్యాలయంలో దుర్గాపురంకి చెందిన దండెల నాగబాబుకు రూ. 3,50,000 రాయలంకి చెందిన మానుకొండ కిరణ్ కుమార్‌కు రూ. 2,51,288 ఎల్వోసీల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ASR: కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గిరిజనసంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రాజేంద్రపాలెం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ జగదీశ్ నాయక్, తమ సిబ్బందితో వైద్య శిబిరం ఏర్పాటు చేశారని సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై పీ.కిషోర్ వర్మ తెలిపారు.
శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నారి మణి సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, రక్తదానం చేసి ప్రాణ దాతలుగా మారండి అని అన్నారు.
TPT: జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో 2026–27 విద్యా సంవత్సరానికి నాలుగు సంవత్సరాల (ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం) ITEP ( శాస్త్రి, BA, B.Ed) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం వెల్లడించింది. అర్హత, ఇతర వివరాలకు https://nsktu.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ మార్చి 10.
KDP: ఆపరేషన్ వజ్రప్రహర్‌లో భాగంగా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పులివెందుల సబ్ డివిజన్ పోలీసులు వేముల(మం) చింతల జుటూరులో మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీలలో పత్రాలు లేని 6 వాహనాలను స్వాధీనం చేసుకుని, గ్రామాలలో శాంతి భద్రతలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
AKP: నర్సీపట్నంకి చెందిన PRTU జిల్లా అధ్యక్షుడు డి. గోపీనాథ్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ కో ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం పలువురు ఉపాధ్యాయులు ఆయన కలిసి అభినందించారు. అనంతరం గోపీనాథ్ మాట్లాడుతూ.. ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన డీఆర్ బకాయిలు, ఐఆర్ ప్రకటన, పీఆర్సీ ప్రకటన, ఇతర సమస్యలు మీద పోరాటం చేస్తామన్నారు.
TPT: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని బాట గంగమ్మ ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. అలిపిరి నడకమార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి మోకాళ్ల పర్వతం వరకు రహదారి విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు.
PPM: పరిమితికి మించిన శబ్దాలు, ధ్వనులు వినడం ద్వారా వినికిడి సమస్యలు తలెత్తుతాయని DMHO డా.ఎస్. భాస్కరరావు పేర్కొన్నారు. ప్రపంచ వినికిడి దినం సందర్భంగా ఆరోగ్య కార్యాలయంలో శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన నిత్య జీవన విధానం, శైలిలో వినికిడి ఙ్ఞానం ద్వారా మనం మాట్లాడటం, నేర్చుకోవడం, వినడం, ప్రమాదాలను పసి కట్టటం జరుగుతుందన్నారు.
ATP: తీవ్ర అస్వస్థతతో అనంతపురంలోని సవేరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత ఉన్నం హనుమంతరాయ చౌదరి త్వరగా కోలుకోవాలని మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. వైద్యుల కృషి, దేవుడి ఆశీస్సులతో ఆయన అనారోగ్య సమస్యలను అధిగమించి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మన మధ్యకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
NTR: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు జీతాలు పెంచమంటే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడాన్ని నిరసనగా జగ్గయ్యపేటలో సీఐటీయు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐటీయు మండల కార్యదర్శి షేక్ గౌస్ మాట్లాడుతూ.. అంగన్వాడీలకు జీతాలు పంచమంటే అరెస్టులు చేయడం దుర్మార్గమని, తక్షణమే ప్రభుత్వం జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.
SKLM: కంటి వ్యాధుల పట్ల జాగ్రత్తలు వహించాలని ఎల్ వి ప్రసాద్ ఆసుపత్రి విజన్ సెంటర్ కో ఆర్డినేటర్ ముద్దాడ అప్పలనాయుడు తెలిపారు. హిరమండలం పంచాయతీ సుభలయ గ్రామంలో కంటి పరీక్ష కేంద్రంలో మంగళవారం విజన్ టెక్నీషియన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి సమస్యలు గుర్తించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక మహిళా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే గళ్ళా మాధవి దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.