NTRl పెనుగంచిప్రోలు మండలం శనగపాడు శివారులోని జనావాసాల మధ్యకు వచ్చిన ఓ భారీ కొండచిలువను స్థానికులు హతమార్చారు. పంట పొలాలు భూములుగా మారడం వల్ల కొండచిలువలు, ఇతర వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తున్నాయని, దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.
ప్రకాశం: వెలిగిండ్ల మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఎంఈవో రామిరెడ్డి తుఫాను ప్రభావంపై ఉపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. తుఫాను ప్రభావం కారణంగా ప్రజలు, విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తగిన జాగ్రత్తలు పాటించేలా ప్రజలకు వివరించాలని ఆయన తెలిపారు.
NLR: పొదలకూరు మండలం పులికల్లు పంచాయతీ పర్వతాపురం గ్రామాన్ని MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం సందర్శించారు. స్పీల్ వే ద్వారా జలాశయం మిగులు నీటిని బయటకు పంపేందుకు ఆరు హిటాచి వాహనాలతో కాలువ పనులను ప్రారంభించారు. పర్వతాపురం, పులికల్లు, వామిటిపర్తి, ఉసపల్లి, అంకుపల్లి గ్రామాల్లో ప్రజలు, పశువులకు ప్రమాదం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు.
ASR: మొంథా తుఫాను వల్ల పాడేరు డివిజన్ పరిధిలో 89 గ్రామాలు, రంపచోడవరం డివిజన్లో 11, చింతూరు డివిజన్లో 46 గ్రామాలు ప్రభావితం అవుతాయని కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం తెలిపారు. పాడేరు డివిజన్లో 56, రంపచోడవరం డివిజన్లో 11, చింతూరు డివిజన్ పరిధిలో 10పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పడిపోయిన చెట్లు, స్థంభాలు తొలగించేందుకు జేసీబీలు సిద్ధంగా ఉంచామన్నారు
W.G: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం దృష్ట్యా ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు మంగళవారం మండలంలో పర్యటించారు. సహాయ కేంద్రాలకు తరలి వచ్చిన ప్రజల వివరాలు, వారికీ కల్పిస్తున్న భద్రత, ఇతర సౌకర్యలకు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారుల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
VZM: మొంథా తుఫాన్ నేపథ్యంలో వరదనీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా తగు ముందస్తు చర్యలను నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆధ్వర్యంలో సిబ్బంది చేపడుతున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రధాన కాలువల గుండా నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించే ప్రక్రియను కమిషనర్ దగ్గరుండి పర్యవేక్షించారు. జేసీబీల సహాయంతో అవసరమైన చర్యలను చేపట్టారు.
PLD: నరసరావుపేట-గుంటూరు రహదారిపై మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఫిరంగిపురం మండలం, వేములూరిపాడు దర్గా సమీపంలో లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AKP: విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో కోటవురట్ల మండలం ఎండపల్లి సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జ్వరాలతో బాధపడుతున్న పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. వైద్య శిబిరాన్ని పర్యవేక్షించిన ఎంపీడీవో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు.
NTR: విజయవాడ నగరంలోని 15 డివిజన్ దర్శిపేట ఎన్ఎస్ఎల్ స్కూల్ మెయిన్ రోడ్డులో ఉన్న జీడిపేట ప్రభుత్వ స్కూల్‌లో పునరావాస కేంద్రాన్ని వీఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వరనగర్, దర్శిపేట, పటమట డొంక రోడ్డు, బందర్ కాలువ గట్టు ప్రాంతాల్లోని తుఫాను బాధితుల కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
VZM: మొంథా తుఫాన్ కారణంగా పొంచి ఉన్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులకు గురకాకుండా ఉండేందుకు తాసీల్దార్ శ్రీనివాసరావు తదితర శాఖల అధికారులు సోమవారం పునరావాస కేంద్రాలను ప్రారంభించారు. ఎస్ కోట మండలం మూలబొడ్డవర, ముసిడిపల్లి, భర్తా పురం ఎస్టీ కాలనీ, పోతనపల్లిలో పునరావాస కేంద్రాలను ప్రారంభించి లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించారు.
కృష్ణా: తీవ్ర తుఫాన్ “మొంథా” రూపం దాల్చి వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలెర్ట్ ప్రకటించిందని టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాతీయ బీసీ సంక్షేమ సంఘం, ఏపీ ఇన్‌ఛార్జ్ యాలగాల నూకానమ్మ ప్రజలను కోరారు. ఏపీ ప్రజల కోసం ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకున్న సీఎం చంద్రబాబు పరిస్థితిని క్షణక్షణం పరిశీలిస్తున్నరన్నారు. మీ పిల్లల్ని ఇళ్లలోనే ఉంచండి, అప్రమత్తంగా ఉండాలని కోరారు
సత్యసాయి: ధర్మవరం రైల్వే డివిజన్ పరిధిలో మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా రైల్వే అధికారులు ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేశారు. అక్టోబర్ 28న మచిలీపట్నం-హిందూపురం రైలు, అక్టోబర్ 29న హిందూపురం-మచిలీపట్నం, ధర్మవరం-నరసాపురం, లింగంపల్లి-నరసాపురం, లింగంపల్లి-కాకినాడ టౌన్ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
TPT: మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా చిగురువాడ – రామాపురం రహదారిలో ప్రవహిస్తున్న స్వర్ణముఖి నదిని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఇవాళ పరిశీలించారు. తూములు వద్ద పూడికను తీసి కట్ట కోతకు గురికాకుండా చూడాలని స్థానిక నాయకులకు ఎమ్మెల్యే ఆదేశించారు. నది వద్దకు ఎవరు రాకుండా చూసుకోవాలని చెప్పారు.
VSP: మోంథా తుపాను నేపథ్యంలో, తుఫాన్ ప్రత్యేక అధికారి అజయ్ జైన్ ప్రస్తుత పరిస్థితి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంగళవారం విశాఖలో మీడియాకు వివరించారు. తుఫాన్ ప్రస్తుతం విశాఖకు 560 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. 80 నుంచి 90 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు.
ASR: తుఫాన్ ప్రభావంతో రంపచోడవరం నియోజకవర్గంలోని ఘాట్ రోడ్‌లలో భారీ వాహనాల రాకపోకలను పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. డీఎస్పీ సాయి ప్రశాంత్ ఆదేశాల మేరకు మారేడుమిల్లి ఘాట్ రోడ్ వైపు వెళ్లే వాహనాలను ఐ.పోలవరం వద్దే మళ్లిస్తున్నామని సీఐ సన్యాసినాయుడు తెలిపారు. తుఫాన్ తగ్గేవరకు భారీ వాహన డ్రైవర్లు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాల్సిందిగా సూచించారు.