KDP: మొంథా తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తొండూరు MRO రామచంద్రుడు సూచించారు. తుపాన్ సమయంలో విద్యుత్ తీగలు తెగిపోవడం, చెట్లు కూలిపోవడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని, పిల్లలు, వృద్ధులు సురక్షిత ప్రాంతాల్లో ఉండేలా చూడాలని ఆయన తెలిపారు.
SKLM: ఆమదాలవలస మండలంలోని పలు గ్రామాలలో సీసీ రోడ్లు, కాలువలు నిర్మాణానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.6.03 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ కార్యాలయం మంగళవారం ప్రకటనలో వెల్లడించింది. మొత్తం 100 పనులకు ఈ నిధులను కేటాయించినట్లు తెలిపారు.
ASR: మొంథా తుఫాను నేపథ్యంలో చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి, ఏడీఏ బీవీ తిరుమలరావు, ఏవో మధుసూధనరావు, జీకేవీధి ఏవో గిరిబాబు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టారు. చౌడుపల్లి, గాడిదలమెట్ట, చెరువువీధి, రింతాడ, అసరాడ, ఏబులం గ్రామాల్లో పొలాలను పరిశీలించారు. పొలాల్లో నీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించాలని రైతులకు సూచించారు.
ELR: ‘మోంథా’ తుఫాను ప్రభావంతో జంగారెడ్డిగూడెం మండలం వెగవరం గ్రామంలో పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరవాస కేంద్రాలను మంగళవారం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుభాష్ పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. తుఫాన్ హెచ్చరికల నేపధ్యంలో ప్రజలెవరూ శిథిలావస్తలో ఉన్న భవనాలలో ఉండవొద్దు అని ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే సూచనలను పాటించాలన్నారు.
KRNL: బనగానపల్లె మండలం శ్రీ నందవరం చౌడేశ్వరి దేవి మాత ఇవాళ ప్రత్యేక పుష్పలాంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్తీక మాసం శుక్ల పక్షం సప్తమి ఆలయ అర్చకులు తెల్లవారుజామున ప్రత్యేకంగా సింగారించి ప్రాతఃకాల పూజలైన రుద్రాభిషేకం, కుంకుమార్చన, మహామంగల హారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి మహిళలు కార్తీక దీపాలు వెలుగించారు.
NLR: బుచ్చి పట్టణంలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు గుడపల్లి కాలువలో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో స్థానిక ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ షాహుల్ జేసీబీ సాయంతో కాలువ పూడికను తొలగించారు. మాజీ సీఎం జగన్, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ఆదేశాల మేరకు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు.
NLR: జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి వానలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్ని శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. మండలాల వారీగా అధికారులతో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
ATP: గుత్తి మున్సిపాలిటీలో ఈనెల 30న సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మంగళవారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 30న గురువారం ఉదయం 11 గంటలకు ఈ కౌన్సిల్ సమావేశం జరుగుతుందన్నారు. చైర్ పర్సన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది తప్పక హాజరు కావాలన్నారు.
ELR: వేలేరుపాడు mls పాయింట్ నుంచి మంగళవారం కుకునూరు, వేలేరుపాడు మండలాల రేషన్ దుకాణాలకి ముందస్తు రేషన్ బియ్యాని జీలిగుమిల్లీ మండల సివిల్ సప్లై డిప్యూటీ తాహసీల్దార్ రమణ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. తుఫాన్ ప్రభావంతో వర్షాలు పడి వాగులు పొంగితే ఇబ్బందులు లేకుండా ముందస్తుగా చౌక దుకాణాలకు రేషన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
TPT: పెళ్లకూరు మండల పరిధిలో తుఫాన్ ప్రభావం కారణంగా భారీ గాలులు, వర్షాలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కె. నాగరాజు సూచించారు. మండలంలో స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో నదీ పరివాహక గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. అవసరం లేకుండా ఎవరూ బయటకు రావొద్దని తెలిపారు.
ATP: శ్రీనగర్ కాలనీలోని నీరు-ప్రగతి పార్కును ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, కమిషనర్ బాలాస్వామి పరిశీలించారు. వాకింగ్ ట్రాక్, జిమ్ పరికరాలు, బెంచీలు, కాంపౌండ్ వాల్ తదితర పనులు పూర్తిచేశామని పేర్కొన్నారు. వాకర్స్ సూచనల మేరకు షెడ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నగరంలోని 28 పార్కులన్నింటినీ అభివృద్ధి చేస్తామని తెలిపారు.
W.G: తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు మంగళవారం పాలకొల్లు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని వాహనాదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే విద్యుత్ స్తంభాలపై చెట్లు పడటంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది.
SKLM: మొంథా తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. జిల్లాలోని ఆమదాలవలస (శ్రీకాకుళం రోడ్) రైల్వే స్టేషన్‌లో తుఫాన్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు మంగళవారం రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు అత్యవసర సమయాల్లో 08942-286213, 08942-286245 కు సమాచారం అందివ్వాలని రైల్వే అధికారులు సూచించారు.
కృష్ణా: తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తుఫాన్ ప్రభావంపై ప్రభుత్వం, కలెక్టర్ విస్తృత అవగాహన కలిగి ఉన్నారని ఆయన తెలిపారు. ఇంకా శిబిరాలకు రాకుండా లోతట్టు ప్రాంతాలు, బలహీన ఇళ్లలో ఉన్న వారు నిర్లక్ష్యం వీడి అధికారుల సూచనలు పాటించి పునరావాస కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
సత్యసాయి: సోమందేపల్లి మండలం చాలకూరు, కేతగానిచెరువు గ్రామపంచాయితీ, నడింపల్లి గ్రామపంచాయతీలలో మంగళవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మండల వైసీపీ కన్వీనర్ గజేంద్ర ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా మద్దతు కోరుతూ సంతకాలు సేకరించారు. ప్రతి ఒక్కరూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని గజేంద్ర కోరారు.