PLD: మొంథా తుపాను కారణంగా పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, తాను, తన సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. మంగళవారం ప్రకటన విడుదల చేస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండల నాయకులు, అధికారులు సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. ప్రజల భద్రతే తమ ప్రధాన ప్రాధాన్యమన్నారు.