KRNL: గూడూరు నగర పంచాయతీ SC కాలనీలో SI రాజ కుళ్లాయప్ప సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, IVRS కాల్స్, నకిలీ రుణాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని, అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. అనుమానిత కాల్స్ విషయంలో జాగ్రత్త వహించాలని కోరారు.
అన్నమయ్య: ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న కులవర్ధన్ తల్లి అంజలిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర శుక్రవారం తెలిపారు. కేసు అత్యంత దారుణంగా జరిగినదని, మైనర్ బాలికను పరిగణనలోకి తీసుకోకుండా అగంతకుడు కులవర్ధన్ బాలికను హత్యకు గురిచేశాడని పేర్కొన్నారు. చట్టం తన పని తానే చేస్తుందన్నారు.
W.G: నరసాపురం సబ్ స్టేషన్లో అత్యవసర మరమ్మతుల దృష్ట్యా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ మధుకుమార్ తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాయపేట, మొగల్తూరు రోడ్డు, జేసీకిలి స్కూల్ ఏరియా, దేవునితోట, సబ్ కలెక్టర్ బంగ్లా, మున్సిపల్ ఆఫీస్ రోడ్డు, మూడు బొమ్మల సెంటర్, క్రిస్టియన్ పేట, కప్పలపేట ప్రాంతాల్లో పవర్ కట్ ఉంటుందని తెలిపారు.
GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10:30 గంటలకు జరగనుంది. నగరంపాలెంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ కిస్ట్రినా అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, ఈ సమావేశంలో చర్చకు వచ్చే అంశాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
KDP: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ CM,YS జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తాడేపల్లిలో ఉపాధ్యాయ MLC,YCP రామచంద్రారెడ్డి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలు కోసం ఉపాధ్యాయుల తరఫున పోరాటాలు చేస్తున్నామని జగన్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు.
SKLM: పొందూరు మండలం రెల్లిగడ్డ వద్ద ఉన్న మంచినీటి పైపులు మరమ్మతులకు గురైనట్లు పంచాయతీ ఈవో పొన్నాడ జగదీశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున నేటి నుంచి నాలుగు రోజులు పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని తెలిపారు. మరమ్మతుల అనంతరం యధావిధిగా సరఫరా ఉంటుందన్నారు.
ATP: గుత్తి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో శనివారం ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్, తెలిపారు. వారు మాట్లాడుతూ.. 2024 ఏప్రిల్, 1వ తేదీ నుంచి 2025 మార్చి, 31వ తేదీ వరకూ మండలంలోని 24 పం చాయతీలలో జరిగిన ఉపాధి పనులకు సంబంధించి సామాజిక తనిఖీలు నిర్వహించారన్నారు.
అల్లూరి: ప్రతినెలా 3వ శుక్రవారం నిర్వహించే ఉద్యోగుల గ్రీవెన్స్‌ను ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో లోకేశ్వరరావు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఉద్యోగుల గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ సమస్యలతో వచ్చిన రెవెన్యూ, సచివాలయ శాఖల ఉద్యోగుల నుంచి అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
NDL: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రికి అధికారులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటంతో మంత్రిని ఘనంగా సత్కరించారు.
సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి (CHC)ని నేడు ఉదయం ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సందర్శించనున్నారు. ఆసుపత్రిలో అమలవుతున్న బయోమెడికల్ వ్యర్థాల బార్కోడ్ సిస్టమ్‌ను పరిశీలించడంతో పాటు రోగులతో మాట్లాడి పరిశుభ్రతపై అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. శానిటేషన్ సిబ్బందితో వ్యర్థాల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు.
BPT: పిట్టలవానిపాలెం మండలంలోని రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద పోలీసులు శుక్రవారం ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. చందోలు ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో వాహనదారుల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.
AKP: కోటవురట్ల మండలం పాములవాకలో 40,000 లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకు శిథిలావస్థకు చేరుకుంది. నేడో, రేపో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. తక్షణం దీనిని తొలగించి కొత్త ట్యాంకు నిర్మించాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా గ్రామంలో కొత్త వీధికి పైప్ లైన్ల నిర్మాణం సరిగా జరగకపోవడంతో తాగునీరు అందడం లేదు.
VZM: బొబ్బిలి రూరల్ CI ఎస్.శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం తెర్లాం మండలం గోపాలవలసలో సైబర్ నేరాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు అకౌంట్, ఆధార్ నంబర్లు, OTPలు గుర్తుతెలియని వారికి చెప్పకూడదన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.
KDP: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలని SP నచికేత్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జమ్మలమడుగు, పులివెందుల సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఉన్న రౌడీ షీటర్లు, ట్రబుల్ మేకర్స్‌పై ఎప్పటికప్పుడు దృష్టి ఉంచి, వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు.