ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఆ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేశారు. కుప్పం నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకుంటామని తెలిపారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే ఆ పార్టీలో సంఖ్యాబలం లేకపోవడంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈక్రమంలో వైస్ జగన్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో ఈ కుండపోత వర్షాలు ఉంటాయని వెల్లడించింది. ఎక్కడెక్కడంటే?
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఏర్పడింది. అయితే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సమావేశం వెలగపూడిలోని సచివాలయంలో ఈరోజు జరుగుతుంది. ఈ సమావేశంలో సూపర్ సిక్స్ పథకాల అమలుపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.
ఏపీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ రవాణా, క్రీడల శాఖ మంత్రిగా ఆయన ఈరోజు బాధ్యతలు చేపట్టిన ఏపీ మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి.. నెలలోగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.
ఎన్నికల అనంతరం కొత్త అసెంబ్లీ ఏపీలో తొలిసారి కొలువుదీరింది. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా తన క్యాంపు ఆఫీస్‌ను సందర్శించారు. నేడు హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఆయన అభిమానులు జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పవన్‌కు స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్‌లో మరో పులి దాడి జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్ద గాయాలు కాలేదు. ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఈ విషయం తెలిసి స్థానిక గ్రామ ప్రజలు ఉలిక్కిపడ్డారు.