CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచి ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి పోలవరం చేరుకున్నారు. ఈ క్రమంలో స్పిల్ వే తదితర ప్రదేశాలను వీక్షించారు. ప్రాజెక్ట్ వద్దకు చేరకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి ముఖ్యనేతలు స్వాగతం పలికారు. ప్రాజెక్టు పనులన్ని పరిశీలించారు. స్విల్ వే, కాఫర్ ఢామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిని అధికారులతో చర్చించారు. మధ్యహ్నం 2 గంటలకు అధికారులతో మాట్లాడి దిశా, నిర్దేశం చేయనున్నారు.
ఐదు సంవత్సరాల తరువాత ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పొలవరం ప్రాజెక్టును సందర్శించారు. గతంలో మాదిరిగానే ప్రతీ సోమవారాన్ని పోలవరం పనులను పరిశీలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. త్వరగా పోలవరాన్ని పూర్తి చేసేందుకు అన్ని ఆదేశాలు ఇచ్చారు. 2014- 2019 వరకు జరిగినా పనులే తప్ప, పెద్దగా ప్రాజెక్టు ముందుకు వేళ్లలేదని టీడీపీ నేతలు పేర్కొన్నారు. సీఎం బాబు పిరియడ్లో ప్రాజెక్టు పూర్తి అవుతుందనే నమ్మకంతో ఉన్నట్లు టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు.
Drone visuals of AP Chief Minister N Chandrababu Naidu’s visit to Polavaram irrigation project. The multi purpose multi crore project despite declared as a national project is yet to be completed.#NCBN#ChandrababuNaidu#Polavarampic.twitter.com/TFZjLcrklO