ఏపీ వాలంటీర్ల వ్యవస్థను సీఎం చంద్రబాబు కొనసాగిస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకుంటే ఈ నెల పింఛన్ల పంపిణీని సచివాలయ ఉద్యోగులతో ఇస్తున్నారు. దీంతో వాలంటీర్ల వ్యవస్థ ఇక ఉండదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఏపీ మంత్రి స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ ప్రతిపక్ష హోదాపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పీకర్‌కు బహిరంగ లేఖ రాశారు. దీంతో ఈ విషయమై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన ఫిక్స్ అయింది. ఈ నెల 29 కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు. ఆ తరువాత పిఠాపురంలో పర్యటించనున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఆ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేశారు. కుప్పం నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకుంటామని తెలిపారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే ఆ పార్టీలో సంఖ్యాబలం లేకపోవడంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈక్రమంలో వైస్ జగన్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు.
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై క్రిమినల్ కేసు నమోదైంది. హయగ్రీవ భూముల విషయంలో అతనిపై కేసు నమోదు చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమంలో ఉన్న సమస్యలపై డిప్యూటీ సీఎంతో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో ఈ కుండపోత వర్షాలు ఉంటాయని వెల్లడించింది. ఎక్కడెక్కడంటే?
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఏర్పడింది. అయితే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సమావేశం వెలగపూడిలోని సచివాలయంలో ఈరోజు జరుగుతుంది. ఈ సమావేశంలో సూపర్ సిక్స్ పథకాల అమలుపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.
నారా లోకేష్ నేడు ఐటీ శాఖ, విద్యా శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. తొలిసారి ఛాంబర్‌లో ప్రవేశించిన అనంతరం మెగా డీఎస్సీ ఫైల్‌పైనే తొలి సంతకం చేశారు.
ఏపీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ రవాణా, క్రీడల శాఖ మంత్రిగా ఆయన ఈరోజు బాధ్యతలు చేపట్టిన ఏపీ మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి.. నెలలోగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేటి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు అయింది. తమను బలవంతంగా రాజీనామా చేయించారని కొంత మంది వాలెంటీర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నికల అనంతరం కొత్త అసెంబ్లీ ఏపీలో తొలిసారి కొలువుదీరింది. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.