ఓ మహిళ అధికారితో వైసీపీ రాజ్యసభసభ్యుడు విజయసాయి రెడ్డి అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే వార్తలు వైరల్‌గా మారాయి. తాజాగా దీనిపై ఆయన ప్రెస్‌మీట్ పెట్టాడు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని ఇప్పుడు తోకలు జాడిస్తున్న వారితోకలు కత్తిరిస్తా అని వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి.
సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన హరేకృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంచి చేసే వాళ్లంతా ఏపీలో ఇక ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు.. ఇలాగేనా ఆయన 75 జయంతిని నిర్వహించేది. మీ రాజకీయ పార్టీలకు పెద్ద పెద్ద సభలు పెట్టారు కదా సొంత తండ్రి కోసం అందరూ కలిసి కూడా నివాళ్లు అర్పించలేదు అని ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం హామీల అమలుపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కసరత్తులు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా తల్లికి వందనం పథకంపై సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది.
గత ప్రభుత్వం అంత వ్యర్థం చేసిందని, రాష్ట్రంలోని ఏ పంచాయతీలో కూడా డబ్బులు లేవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఎస్‌ఎల్‌ఆర్‌ఎంను మొదట పిఠాపురం నుంచే ప్రారంభిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.
తిరుమలకు వచ్చే భక్తులకు అందించే ప్రసాదంలో నాణ్యత పెరిగిందని టీటీడీ ఈవో జె. శ్యామలరావు వెల్లడించారు. ఆలయంలో ప్రతీ రోజు 2 లక్షల మందికి అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు మీడియాతో పంచుకున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు వంటివని చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు.
వినాయక చవితి పండుగ త్వరలో రానుంది. ఈ సందర్భంగా అందరూ మట్టి గణపతినే పూజించాలని జనసేన అధినేత, ఏపీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ హితవుపలికారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇసుక రవాణకు సంబంధించి తాత్కాలిక విధివిధానాలను ఇచ్చింది. 2019-2021 సంవత్సరాలకు సంబంధించిన విధానాలను రద్దు చేసింది. తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇసుకను వినియోగాదారులకు ఉచితంగా అందుబాటులో ఉంచాలని పేర్కొంది.
సోమవారం వైఎస్‌ఆర్ జయంతి. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిలలు కలిసి తండ్రికి నివాళులు అర్పిస్తారని తొలుత భావించారు. అయితే అందుకు షర్మిల నో చెప్పారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
పీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ విషయాల గురించి చర్చించుకున్నారో ప్రజలకు చెప్పాలని వైసీపీ నేత విజయసాయిరెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ వాటా కోరినట్టయితే హైదరాబాద్ ఆదాయంలో ఏపీకి వాటా ఇవ్వాలని అడగడంలో నిజమెంతో తెలియాలని తెలిపారు.
నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు మొదటిసారి వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ గడ్డపై టీడీపీకు పునర్ వైభవం వస్తుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో భేటీ అయ్యారు. మొదట ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాపై ప్రధానంగా చర్చించనున్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వరుసగా కేంద్రమంత్రులను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఏపీ ప్రధాన్యత గురించి వారితో చర్చంచారు.