• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘పరిశ్రమల ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకోవాలి’

ATP: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పారిశ్రామికవేత్తలను అన్ని రకాల సంబంధిత శాఖ అధికారులు ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల, ఎగుమతి ప్రోత్సాహక కమిటీతో సమావేశం నిర్వహించారు.

September 26, 2025 / 06:50 PM IST

మొదటి మహిళా మేయరుగా ముంతాజ్

KDP: నగరపాలక సంస్థ మొదటి నూతన మహిళా మేయరుగా ముంతాజ్ బేగం బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ మనోజ్ రెడ్డి దగ్గరుండి ఆమెతో సంతకం చేయించి బాధ్యతలు అప్పగించారు. నగరపాలక సంస్థ ఏర్పడి 20 సంవత్సరాల కాలంలో మొదటిసారి మహిళకు మేయరుగా అవకాశం వచ్చిందని పలువురు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మేయరును సత్కరించారు.

September 26, 2025 / 06:48 PM IST

విశాఖ శ్రీ శారదాపీఠంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

విశాఖపట్నంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీ శారదాపీఠంలో శ్రీ శారదా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం అమ్మవారికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి పూజీలు నిర్వహించారు.ఉత్సవాలలో భాగంగా హోమాలు, యజ్ఞాలు, చండీ పారాయణాలు, సహస్రనామ అర్చనలు వంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.

September 26, 2025 / 06:48 PM IST

‘సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయండి’

PPM: పార్వతీపురం నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్వతీపురం పరిధిలో రెండు మేజర్ ప్రాజెక్టులు, మూడు మైనర్ ప్రాజెక్టులు ఉన్నాయని అదికారులు పట్టించుకోకపోవడంతో అవి శిధిల దశలో కొట్టుమిట్టాడుతున్నాయని పేర్కొన్నారు.

September 26, 2025 / 06:46 PM IST

‘మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ద చూపాలి’

VZM: గరివిడి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ శుక్రవారం పరిశీలించారు. స్టేషన్ ఆవరణతో పాటు రికార్డులను తనిఖీ చేసి పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహిళల, బాలల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మహిళల రక్షణ కోసం రూపొందించిన శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు.

September 26, 2025 / 06:44 PM IST

‘ఇళ్ల నిర్మాణం పూర్తి చేయండి’

ELR: కూటమి ఏర్పడి ఏడాదిన్నరైనా గృహ నిర్మాణ పథకాని అడుగులు పడడంలేదని జీలుగుమిల్లి మండలంలోని పేదలు, దళితులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇతర సూపర్ సిక్స్ పథకాలు అమలవుతున్నా, ఇళ్ల కల మాత్రం పునాదుల్లోనే ఆగిపోయిందన్నారు. ఆలస్యంతో లబ్ధిదారుల్లో ఆగ్రహం, నిరాశ పెరుగుతోందన్నారు. పేదోడి సొంతింటి కల సాకారం కానట్టే ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

September 26, 2025 / 06:41 PM IST

“రైతన్నకు తోడుగా కాంగ్రెస్”

VZM: రాష్ట్రంలో రైతన్నల ఆక్రందన కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని జిల్లా డీసీసీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ అన్నారు. శుక్రవారం విజయవాడలోని ఏపీసీసీ అధ్యక్షురాలు YSషర్మిలా రెడ్డి అధ్యక్షతన “రైతన్నకు తోడుగా కాంగ్రెస్”అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈమేరకు సీఎం చంద్రబాబుకు వినతి పత్రం ఇవ్వటానికి బయలుదేరగా మార్గమధ్యంలో పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారన్నారు.

September 26, 2025 / 06:40 PM IST

చాగల్లు: బాలకృష్ణ వెంటనే జగన్ కు క్షమాపణ చెప్పాలి

E.G: అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ సీఎం జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, వెంటనే క్షమాపణలు చెప్పాలని మాజీ MLA, కొవ్వూరు వైసీపీ ఇంఛార్జ్ తలారి వెంకటరావు డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం చాగల్లులోని అంబేద్కర్ సెంటర్ వద్ద పార్టీ శ్రేణులతో నిరసన చేపట్టారు. బాలకృష్ణ మాటలను అసెంబ్లీ సమావేశ వీడియోల్లో తొలగించాలన్నారు.

September 26, 2025 / 06:40 PM IST

P-4 అమలుపై శిక్షణ

W.G: పాలకోడేరు మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం గ్రామ సచివాలయ సిబ్బందికి పేదరిక నిర్మూలనపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన P-4 కార్యక్రమం (పబ్లిక్, ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం)లో భాగంగా పేదరికాన్ని నిర్మూలించడం ఎలా అనే అంశంపై ఈ శిక్షణ జరిగింది. ఎంపీడీఓ వీ.రెడ్డియ్య ఆధ్వర్యంలో అనేక కీలక అంశాలపై అవగాహన కల్పించారు.

September 26, 2025 / 06:38 PM IST

వాగులోకి దూసుకు వెళ్లిన లారీ

ELR: ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామంలో ఎత్తిపోతల పథకం వద్ద ఉన్న వాగులోకి శుక్రవారం చిప్స్ లోడ్ లారీ బోల్తా పడింది. కొండపల్లి గ్రామం నుండి కంకర చిప్స్ లోడుతో ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం వస్తున్న లారీ వాగులోకి దూసుకు వెళ్ళింది. మండల పరిధిలోని అనేక వంతెనలు రక్షణ గోడలు లేకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు తెలిపారు.

September 26, 2025 / 06:38 PM IST

కోర్టు భవనాల కోసం నిధులు మంజూరు చేయాలి: ఎమ్మెల్యే

VZM: కొత్తవలసలో ఉన్న కోర్టు భవనాలు శిథిలస్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి రెండు భవనాలకు త్వరితగతిన నిధులు మంజూరు చేసి, పనులు మొదలు పెట్టాలని శుక్రవారం శాసనసభ సమావేశంలో ప్రస్తావన తీసుకువచ్చారు. దీనిపై స్థానిక న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

September 26, 2025 / 06:37 PM IST

ప్రైవేటీకరణ చర్యలు తక్షణమే విరమించుకోవాలి: సీపీఎం

W.G: విశాఖ ఉక్కును కాపాడాల్సిన భాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బలరాం అన్నారు. శుక్రవారం భీమవరం సీపీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేసే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ ప్రైవేటీకరణ చర్యలు తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

September 26, 2025 / 06:35 PM IST

‘బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన వైద్య సేవలు’

TPT: తిరుమలలోని రామ్ భగీచా-2లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌లో అశ్వినీ ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ కుసుమ కుమారితో కలిసి శుక్రవారం ఆమె సమావేశం నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ మేరకు 50 మంది డాక్టర్లు, 60 మంది పారా మెడికల్ సిబ్బంది సేవలందిస్తున్నారన్నారు.

September 26, 2025 / 06:34 PM IST

ట్రాక్టర్ డ్రైవర్ నేరం ఒప్పుకున్నాడు: డీఎస్పీ

ATP: పామిడి మండలం జి. కొట్టాలకి చెందిన సతీష్ రెడ్డి మృతి కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సాక్ష్యాధారాల సేకరణ, డాగ్ స్క్వాడ్ పరిశీలన, పోస్టుమార్టం నివేదిక, సీసీ ఫుటేజీ ఆధారంగా ట్రాక్టర్‌ను ఢీకొని సతీశ్ మృతి చెందాడని తేల్చారు. ట్రాక్టర్ డ్రైవర్ సాయికుమార్ నేరం ఒప్పుకున్నాడని, లీగల్ ఒపీనియన్ తీసుకుని చర్యలు తీసుకుంటామని DSP రవిబాబు తెలిపారు.

September 26, 2025 / 06:30 PM IST

‘ఆర్టీసీ కార్మికులను పర్మినెంట్ చేయాలి’

W.G: ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం పండుగ సెలవులు అమలు చేయాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తులసిరావు డిమాండ్ చేశారు. శుక్రవారం నరసాపురం మీరా భవనంలో ఆర్టీసీ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ మేరకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు.

September 26, 2025 / 06:30 PM IST